బాహుబలి టికెట్ల అరాచకాలకు అంతే లేదా?
బాహుబలి లాంటి అద్భుతాన్ని వెండితెర మీదే చూడాలంటాడు రాజమౌళి. ఈ సినిమాతో ఏ సంబంధం లేని అల్లు అరవింద్ సైతం మీడియా ముందుకొచ్చి పైరసీని ప్రోత్సహించవద్దని.. బాహుబలి సినిమాను థియేటర్లలోనే చూడాలని చెప్పాడు. మూడేళ్లుగా ఈ సినిమాను గొప్పగా ప్రమోట్ చేసి.. గొప్ప హైప్ తీసుకొచ్చారు బాగానే ఉంది. అందరూ థియేటర్లలోనే సినిమా చూడాలని.. అది కూడా సాధ్యమైనంత త్వరగా చూడాలని ఆశగా ఉన్నారు. కానీ టికెట్లు దొరకడమే అసాధ్యంగా మారింది. థియేటర్ల దగ్గరికెళ్తే టికెట్లు లేవు. ఆన్‌లైన్లో చూస్తే సోల్డ్ ఔట్. ఇక టికెట్ సంపాదించేదెలా?
అరాచకమైన విషయం ఏంటంటే.. థియేటర్ల యాజమాన్యాలే బ్లాక్‌లో టికెట్లు అమ్మేస్తుండటం. ప్రభుత్వం కూడా చూసీ చూడనట్లు ఉండటం. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అఫీషియల్‌గానే టికెట్ల ధరలు పెంచేసి అమ్మేస్తున్నారు. విజయవాడ లాంటి నగరాల్లో ప్రేక్షకులకు 'కాంబో' పేరుతో బంపర్ ఆఫర్ ఇచ్చారు. టికెట్ ధర 125 అయితే.. దాంతో పాటు కూల్‌డ్రింక్, ఓ స్నాక్ కలిపి కాంబో పేరుతో రూ.200 పెట్టి టికెట్ అమ్ముతున్నారు. ఈ కాంబో ఆఫర్ వద్దంటే టికెట్ ఇవ్వరట. సామాన్య ప్రేక్షకులకు టికెట్లు అందుబాటులో ఉంచుకుండా..
బ్లాక్ చేసి కార్పొరేట్ కంపెనీలకు, పలుకుబడి ఉన్న వాళ్లకు బల్క్‌లో రెట్టింపు ధరలు పెట్టి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాయి థియేటర్ల యాజమాన్యాలు. మామూలు థియేటర్లకే కాకుండా మల్టీప్లెక్స్‌ల్లోనూ ఈ దోపిడీ జరుగుతోంది.
పోలీసులు కానీ, అధికారులు కూడా ఏం జరుగుతోందని పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్లను సంతృప్తి పరచడానికి కొన్ని టికెట్లు ఇచ్చేస్తున్నారు. అంతే సైలెన్స్. ఎవరు ఎంత పెట్టి టికెట్ అమ్ముతున్నారు, ఎన్ని షోలు వేస్తున్నారు.. సామాన్యులకు టికెట్లు ఇస్తున్నారా లేదా.. టికెట్లు ఏమవుతున్నాయి.. అని అడిగే నాథుడు లేడు. ఎవరైనా థియేటర్ దగ్గర గొడవ చేస్తే.. నీ దిక్కున్న చోట చెప్పుకో అని సమాధానం.
బాహుబలి టికెట్ల విషయంలో సాగుతున్న అరాచకాలపై అఖిల భారత ప్రేక్షకుల సంఘం ప్రతినిధులు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ కూడా పెట్టారు. టికెట్ల విషయంలో జరుగుతున్న దోపిడీపై గళమెత్తారు. నాలుగు రోజులుగా ఈ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నామని.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైరసీ గురించి గొంతు చించుకునే సినీ పెద్దలు టికెట్ల విషయంలో జరుగుతున్న దోపిడీపై మాట్లాడరా అని వారు ప్రశ్నించారు. మరోవైపు ఈ దోపిడీపై హైకోర్టులో పిల్ కూడా వేశారు. బాహుబలి విడుదలపై స్టే కూడా విధించాలని కోరారు. కానీ దానిపై విచారణ జరిగిందో లేదో తెలియట్లేదు. రేప్పొద్దున థియేటర్ల దగ్గర ఎన్ని గొడవలు జరుగుతాయో.. ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో.. తొక్కిసలాటలు జరిగి అభాగ్యులకు ఏమైనా అవుతుందేమో అన్న భయాలు కూడా ఉన్నాయి.