• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ ని ఆ యంగ్...

మెగాస్టార్ ని ఆ యంగ్ డైరెక్టర్ హ్యాండిల్ చేయగలడా...?

By - Tupaki Desk
Update: 2020-04-10 17:30 GMT
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్' సినిమా తెలుగు రీమేక్ రైట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ తరపున రామ్ చరణ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి మోహన్ లాల్ కెరీర్లోనే చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి ఈ మలయాళ రీమేక్ లో నటించనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక అప్పటి నుంచి ఈ రీమేక్ దర్శకత్వ బాధ్యతలు ఏ డైరెక్టర్ కి అప్పగించనున్నారో అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అందులో భాగంగా టాలీవుడ్ లోని అందరు క్రేజీ డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కాగా ఇప్పుడు లేటెస్టుగా 'లూసిఫర్' సినిమా రీమేక్ కి దర్శకత్వం వహించే అవకాశం ఒక యువ దర్శకుడికి దక్కినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్ర రీమేక్ కి డైరెక్షన్ చేసే బాధ్యతని యంగ్ డైరెక్టర్ సుజిత్ కి అప్పగించినట్లు వెల్లడించారట. ఇప్పటికే తెలుగు వెర్షన్ సిద్ధం చేయమని సుజిత్ తో చెప్పాడట మెగాస్టార్. సుజీత్ అల్రెడీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు లూసిఫర్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని సమాచారం. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఈ యంగ్ డైరెక్టర్ సుజీత్ మెగాస్టార్ ని ఎలా హ్యాండిల్ చేయగలదని చర్చించుకుంటున్నారట. కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న సుజీత్ మెగాస్టార్ తో ఎలా సినిమా తీస్తాడో అని మెగా అభిమానులు కలవరపడుతున్నారట.

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన సుజీత్.. యువ హీరో శర్వానంద్ నటించిన 'రన్ రాజా రన్' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. టిపికల్ స్క్రీన్ ప్లేతో తెలుగు ప్రేక్షకులను మెప్పించగలిగాడు. ఈ హిట్ తో ఏకంగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నే మెప్పించాడు ఈ కుర్ర డైరెక్టర్. 'బాహుబలి' లాంటి సినిమా తర్వాత ప్రభాస్ నెక్స్ట్ సినిమా సుజీత్ చేతిలో పెట్టాడంటే అర్థం చేసుకోవచ్చు మనవాడి టాలెంట్. ప్రభాస్ తో భారీ తారగణంతో భారీగా తెరకెక్కించిన 'సాహో' సినిమాతో తన సత్తా చాటుకున్నాడు. సాహో తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా హిందీలో మాత్రం దుమ్ము దులిపింది. కానీ ఈ సినిమా తర్వాత మరే క్రేజీ ప్రాజెక్ట్ దక్కించుకోలేకపోయిన ఈ యంగ్ డైరెక్టర్ చిరంజీవి అందించిన మెగా ఆఫర్ ని వెంటనే ఓకే చేసాడట. ఈ నేపథ్యంలో ఒక యువ దర్శకుడు మెగాస్టార్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడని భయపడుతున్నారట. కొంతమంది మాత్రం రెబెల్ స్టార్ తో పాన్ ఇండియా మూవీ హ్యాండిల్ చేయగలిగిన సుజీత్ ఇప్పుడు మెగాస్టార్ తో ఒక రీమేక్ సినిమా హ్యాండిల్ చేయలేడా అంటున్నారట. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో తన కెరీర్లో 152వ చిత్రం 'ఆచార్య' లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన అనంతరం సుజీత్ డైరెక్షన్ లో 'లూసిఫర్' తెలుగు రీమేక్ పట్టాలెక్కే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Tags:    
  • Can This Young Director Handle Megastar 
  • Chiranjeevi 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Chiru152 Title 
  • Sujith To Direct Chiranjeevi 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS