క‌డ‌వ‌ర్ ట్రైలర్: క్రైమ్ థ్రిల్ల‌ర్ లో పాల్ శోధ‌న దేనికోసం?

Update: 2022-07-31 13:47 GMT
ప్ర‌యోగాలు చేయాలంటే అమ‌లాపాల్ త‌ర్వాతే. ఇంత‌కుముందు ఆమె (ఆడై) చిత్రంలో న‌గ్నంగా న‌టించి సంచ‌ల‌నం సృష్టించింది. పాల్ గ‌ట్సీ పెర్ఫామెన్స్ కి ప్ర‌శంస‌లతో పాటు అవార్డులు ద‌క్కాయి. ఇప్పుడు మ‌రో ఛాలెంజింగ్ రోల్ తో తిరిగి అభిమానుల ముందుకు వ‌చ్చింది. క‌డ‌వ‌ర్ అనేది మూవీ టైటిల్. మలయాళీ అనూప్ పనికర్ దర్శకత్వం వహించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రంలో పాల్ పోలీస్ అధికారిక‌గా న‌టించింది. కడవర్ చిత్రం డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో డైరెక్ట్ డిజిటల్ విడుదలకు సిద్ధ‌మైంది.

ఈ సినిమా ట్రైలర్ ఇటీవ‌ల‌ విడుద‌లైంది. ట్రైలర్  ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో క‌ట్టి ప‌డేసింది. క‌డవర్ ఒక ఆసక్తికరమైన థ్రిల్లర్ అని అర్థ‌మ‌వుతోంది. డాక్టర్ భద్ర అనే పోలీస్ సర్జన్ పాత్రలో అమలా పాల్ నటించింది. తప్పిపోయిన బాలిక శవమై కనిపించ‌గా గ్యాంగ్ రేప్ చేశార‌ని అనుమానించి ఇన్వెస్టిగేష‌న్ ప్రారంభిస్తారు పోలీసులు. అదే క్ర‌మంలో డాక్టర్ భద్ర ఈ కేసును ఎలా ఛేదించారు? అనేది సినిమా క‌థాంశం. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ట్రైలర్ ఆస‌క్తిని పెంచ‌డంతో ప్రేక్షకుల్లో ఓటీటీ వీక్ష‌ణ షురూ అయిన‌ట్టే. నేప‌థ్య సంగీతం ఉత్కంఠ‌ను పెంచ‌గా.. సినిమాటోగ్రఫీ ఆస‌క్తిని పెంచింది. ఈ సినిమాలో అమలాపాల్ లుక్ రెండు విభిన్న‌మైన షేడ్స్ తో క‌నిపిస్తోంది. మేక‌ప్ లెస్ లుక్ లో ఎంతో నేచుర‌ల్ గా క‌నిపిస్తోంది.

క‌డవర్ ఆగస్టు 12న తమిళం- తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ కి సిద్ధ‌మ‌వుతోంది. హరీష్ ఉత్తమన్- రిత్విక- అతుల్య రవి- త్రిగుణ్ - మునిష్కాంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రంజిన్ రాజ్ సంగీతం సమకూర్చారు.

రాక్ష‌సుడు త‌ర్వాత క్రైమ్ థ్రిల్ల‌ర్

క్రైమ్ థ్రిల్ల‌ర్ల‌కు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఆద‌ర‌ణ బావుంది. ముఖ్యంగా ఓటీటీ వీక్ష‌కుల‌కు ఇవి స్పెష‌ల్ ట్రీట్ గా మారాయి. ఇంత‌కుముందు త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ ని తెలుగులో `రాక్ష‌సుడు` పేరుతో రీమేక్ చేసి విడుద‌ల చేయ‌గా ఘ‌న‌విజయం సాధించింది.  ఈ సినిమా హీరో బెల్ల‌కొండ శ్రీ‌నుకి మంచి హిట్టుతో పాటు పేరొచ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ అదే త‌ర‌హాలో ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ కాప్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో వ‌స్తున్న క‌డ‌వ‌ర్ తెలుగు ఆడియెన్ ని ఏ మేర‌కు మెప్పిస్తుందో వేచి చూడాలి.



Full View
Tags:    

Similar News