పుష్ప రాజ్‌ రెడీ అవ్వడానికి హీరోయిన్‌ కంటే ఎక్కువ టైమ్‌ అయ్యేదట!

Update: 2021-12-15 10:27 GMT
అల్లు అర్జున్‌.. సుకుమార్ ల కాంబోలో రూపొందిన పుష్ప సినిమా విడుదలకు ముస్తాభయ్యింది. రేపు యూఎస్ లో ప్రీమియర్ లు పడబోతున్నాయి.. ఎల్లుండి దేశ వ్యాప్తంగా థియేటర్ల వద్ద పుష్ప రాజ్ హడావుడి దద్దరిల్లబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప రాజ్ భారీ ఓపెనింగ్స్ రికార్డును నమోదు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

అల్లు అర్జున్‌ ఈ సినిమా తో హిందీలో కూడా తన స్థానంను పదిలం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా లో బన్నీ లుక్ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. కనుక అక్కడ కూడా భారీగానే పుష్ప రాజ్ రాబట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సినిమా ఇంత భారీగా రావడానికి.. ఇంత మంది మాట్లాడుకోవడానికి కారణం అల్లు అర్జున్‌ లుక్‌ అనడంలో సందేహం లేదు.

ఇప్పటి వరకు స్టైలిష్‌ స్టార్‌ పేరుతో కొనసాగిన అల్లు అర్జున్ ఈ సినిమా లో పూర్తి విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నాడు. మరీ నెరిసిన గడ్డం.. పెరిగిన జుట్టు మాసిన బట్టలు.. నోట్లో ఓ బీడి ఇలా అతడి రూపం మరీ బాబోయ్ ఇంత మాస్ ఏంటీ అన్నట్లుగా ఉంది. మరీ ఇంత మాస్ ను తట్టుకోగలమా అంటూ కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ ఈ లుక్ కు చాలా కష్టపడ్డాడు. గత ఏడాది ఆరంభం నుండి జుట్టు మరియు గడ్డంను కంటిన్యూ చేస్తున్నాడు. గత ఏడాదికే పూర్తి అవ్వాల్సి ఉన్నా షూటింగ్ ఆలస్యం అవ్వడం... కరోనా వల్ల ఇప్పటి వరకు పుష్ప లుక్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఇక షూటింగ్‌ సమయంలో మేకరోవర్‌ కు రెండున్నర నుండి మూడు గంటల పాటు పట్టిందని అంటున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు కూడా మేకర్‌ వేయడానికే దాదాపుగా రెండున్నర నుండి మూడు గంటల సమయం పట్టేది. ఆ మేకప్ ను షూటింగ్‌ తర్వాత రిమూవ్‌ చేయడానికి మరో 30 నిమిషాల వరకు పట్టేదని బన్నీ పేర్కొన్నాడు.

సహజంగా అయితే హీరోయిన్ పాత్ర మేకప్ కు గంట నుండి గంటన్నర పడుతుంది. మహా అయితే రెండు గంటలు పడుతుంది. కాని బన్నీ పుష్ప లుక్ కు ఏకంగా మూడు గంటలు అంటే ఏ స్థాయిలో ఆ మేకప్‌ తో లుక్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఈ సమయంలో ఇలాంటి విషయాలు సినిమాపై మరింతగా అంచనాలు పెంచేస్తున్నాయి.

బన్నీ అంత కష్టపడి చేయించుకున్న మేకప్ ను వెండి తెరపై చూడాలని ఆశగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. రష్మిక మందన్నా ను కూడా ఈ సినిమా లో డీ గ్లామర్ గా చూపించారు. కనుక ఆమె మేకప్ కూడా రెండు మూడు గంటల సమయం పట్టే ఉంటుంది.



Tags:    

Similar News