బ్రహ్మీ మళ్లీ వేసేశాడు
మొత్తం కెరీర్ లోనే బాడెస్ట్ టైంలో ఉన్నాడు బ్రహ్మానందం. ఇది వరకు ఉన్నన్ని సినిమాలూ లేవు. చేసినవాటిలో నవ్వులూ లేవు. అంతే కాదు.. విమర్శలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది ఈ నవ్వుల రాజుకి. రీసెంట్ గా కళ్యాణ్ రామ్ మూవీ షేర్ లోనూ.. బ్రహ్మీ పాత్ర ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
రామ్ చరణ్ బ్రూస్ లీలో బ్రహ్మీ చేసిన కేరక్టర్ నవ్వు తెప్పించలేదు సరికదా.. చాలాసార్లు చిరాకు పెట్టించింది. ఇప్పుడు షేర్ లోనూ సేమ్ డిట్టో. బ్రహ్మానందం యాక్షన్ ని - కామెడీని చూసి నవ్వినవాళ్లు.. ఇప్పుడాయన పరిస్థితి చూసి నవ్వుకోవాల్సి వస్తోంది. టైమింగ్ తోనే నవ్వులు కురిపించే బ్రహ్మానందానికి వచ్చిన పరిస్థితి చూసి జాలి పడుతున్నవాళ్లు కూడా ఉన్నారు.
రీసెంట్ గా బ్రహ్మీ చేసిన ఓ కామెంట్ కూడా అనేక ప్రశ్నలకు దారితీశాయి. కేరక్టర్ పండకపోతే నేనేం చేస్తాను.. డైరెక్టర్ బాగా తీయాలి, రైటర్ బాగా రాయాలి కదా అన్నాడు బ్రహ్మానందం. అన్నీ కరెక్ట్ గా కుదిరితే కొత్త కమెడియన్లు కూడా కుమ్మేస్తారు కదా. భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి బ్రహ్మీ వెంట ఎందుకు పడాలి డైరెక్టర్లయినా. దీంతో నవ్వుల రాజుకు మాజీ అయిపోయే పరిస్థితి వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఒకవేళ నాన్నకు ప్రేమతో మూవీలో కేరక్టర్ పండకపోతే మాత్రం.. బ్రహ్మీ కెరీర్ సంక్షోభంలో పడ్డట్లే.