డైరెక్ట‌రే బాస్‌, ఆయ‌న్నే తిట్టండి

Update: 2015-11-20 05:14 GMT
1000 సినిమాల రారాజుగా వెలిగిపోతున్నాడు హాస్య బ్ర‌హ్మీ. ప్ర‌పంచంలోనే హాస్య న‌టుల కేట‌గిరీలో ఇదో అరుదైన రికార్డ్‌. ఇప్ప‌టికీ ఏడాదికి 10 సినిమాల్లో న‌టిస్తున్న క‌మెడియ‌న్‌ గా ఆల్‌ టైమ్ టాప్‌ స్లాట్‌ లో ఉన్నారాయ‌న‌. అంత‌టి సీనియ‌ర్ న‌టుడిపై ఇటీవ‌లి  కాలంలో ఎన్నో నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. బ్ర‌హ్మానందం కామెడీ  ఫెయిల‌వుతోంది. ప‌ర‌మ రొటీన్ గా బోరింగ్‌ గా ఉంటోంది.. అందుకే అత‌డికి అవ‌కాశాలు రావ‌డం లేదు. ఇచ్చిన చాన్సులు కూడా వెన‌క్కి లాక్కుంటున్నారు.. అంటూ ఇటీవ‌లి కాలంలో ప్ర‌చార‌మైంది.

అయితే ఈ కామెంట్ల‌కు అప్ప‌టికి స్పందించ‌క‌పోయినా బ్ర‌హ్మానందం త‌న గురించి ఎవ‌రేం అనుకుంటున్నారో ఆరాతీసార‌ట‌. అంతేకాదు.. ఆ కామెంట్లు చేసిన వారికి డిప్ప ప‌గిలే ఆన్స‌ర్ కూడా ఇచ్చారాయ‌న‌. నేను కేవ‌లం న‌టుడిని మాత్ర‌మే. నా కోసం ఫ‌లానా క్యారెక్ట‌ర్ క్రియేట్ చేయండి అని ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల్ని ఆర్డ‌ర్ వేయ‌లేను. వారేం రాసుకొస్తే అందులో నేను న‌టించి చూపిస్తానంతే. డైరెక్ట‌ర్ ఏం చెబితే అదే చేస్తాను. సినిమా అంటే కోట్ల రూపాయ‌ల బిజినెస్ గేమ్‌. ఇందులో నేను వేలు పెట్టి కెల‌క‌లేను. ఎవ‌రేం చెబితే అది చేయ‌డం వ‌ర‌కే. ఆ లెక్క‌న నా చేత ఏ డైరెక్ట‌ర్ ఫెయిల్యూర్ కామెడీ చేయించారో ఆయ‌న్ని తిట్టండి. బోర్ కొడితే అందుకు నేను కాదు బాధ్యుడిని.. అంటున్నారాయన.

నేను సేమ్ రైట‌ర్స్‌ - డైరెక్ట‌ర్స్‌ తో రిపీటెడ్‌ గా ప‌నిచేశాను.  చాలా సినిమాల్లో న‌వ్వించ‌గ‌లిగాను. కొన్నిటిలో న‌వ్వించ‌లేక‌పోయానంటే కార‌ణ‌మేంటో మీరే అర్థం చేసుకోండి .. అంటూ బ్ర‌హ్మ భ‌లే ట్విస్టిచ్చారు. దీన్ని బ‌ట్టి మీకేం అర్థ‌మైంది. చేసేవాడు కాదు చేయించేవాడు ముఖ్యం. ఫాల్ట్ అక్క‌డుంది. కాబ‌ట్టి అట్నుంచి న‌రుక్కుని రండి.. అని చెప్పారు ఈ సీనియ‌ర్ క‌మెడియ‌న్‌. ద‌ట్సిట్‌.
Tags:    

Similar News