ఈ స్టార్ హీరోయిన్ ప్రియుడు వయసులో చిన్నవాడేనట..!
గతేడాది దక్షిణాది స్టార్ హీరోయిన్స్ సమంత - నయనతార సోషల్ మీడియా ద్వారా కొత్త సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి చేస్తుంది తెలుగు మూవీ మాత్రం కాదు. 'కాతు వాకుల రెండు కాదల్' అనే తమిళ చిత్రం. కానీ తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా అభిమానులు ఎదురు చూస్తున్నారు. సమంత, నయనతారలను ఒకే తెరమీద చూస్తే నిజంగానే ఐ-ఫీస్ట్ అంటున్నారు. ఈ చిత్రంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని టాక్. ఎలాగంటే ఇందులో హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. సమంత - నయన్ చిత్రంలో విజయ్ ఉన్నాడని తెలియగానే ఫ్యాన్స్ లో అంచనాలు రెట్టింపు అయిపోయాయి.
ఇక నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. మరో విశేషం ఏంటంటే.. నయనతార - సమంత - విజయ్ సేతుపతి కలిసి నడుస్తుండటం ఇదే తొలిసారి. అయితే.. సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు స్టార్స్ కలిసి నటిస్తుండటం ప్రేక్షకులు పెద్ద విశేషంగా భావిస్తున్నారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వినోదభరితంగా సాగనుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే సినిమా గురించి పక్కనపెడితే.. డైరెక్టర్ విగ్నేష్ - నయనతార లవ్ స్టోరీ గురించి రోజుకో వార్త బయట వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ కపుల్ గురించి క్రేజీ న్యూస్ వస్తుంటాయి కానీ తాజాగా డైరెక్టర్ విగ్నేష్ స్వయంగా ఫ్యాన్స్ ప్రశ్నలకు స్పందించి సమాధానాలు తెలిపాడు.
అందులో భాగంగానే చాలా విషయాలు బయటపెట్టాడు. ముఖ్యంగా వంట విషయంలో నయన్ చాలా వీక్ అని చెప్పి.. ఘీ రైస్ చికెన్ మాత్రం అద్భుతంగా వండుతుందని చెప్పాడు. అలాగే మీరు ఎక్కడుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు? అంటే.. నయన్ ఎక్కడుంటే అక్కడే నాకు స్వర్గంలా ఉంటుందని కొంటె సమాధానం చెప్పాడు. ఈ మద్యే అమ్మడు ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలు పోస్ట్ చేస్తోంది. అయితే ఇద్దరి మధ్య వయసు గురించి సందేహాలు వచ్చేసరికి అందరూ వికీపీడియా ఓపెన్ చేస్తున్నారు. దాని ప్రకారం అయితే నయన్ విగ్నేష్ కంటే 10నెలలు పెద్దదని తెలుస్తుంది. అదిగాక ఇదివరకు విగ్నేష్ కూడా ఓ సందర్బంలో నయన్ నాకంటే 10 నెలలు పెద్దదే అని చెప్పినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.