మాస్ డైరక్టర్ తో అఖిల్ సైన్స్ ఫిక్షన్

Update: 2016-10-26 11:36 GMT
ఈ దసరా పూర్తయ్యేసరికి వెండితెరపై అక్కినేని యువకిశోరం తెరంగేట్రం చేసి సంవత్సరం పూర్తయ్యింది. అయినాసరే ఇంతవరకు మనోడి రెండో సినిమా పట్టాలెక్కకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. అయితే అఖిల్ మాత్రం.. తన రెండో సినిమాను వంశీ పైడిపల్లితో అని ఒకసారి అలాగే హను రాఘవపూడితో అని మరోసారి ప్రకటించిన తరువాత మనోడు డ్రాప్ అయ్యాడు. తరువాత కింగ్ నాగ్ స్వయంగా రంగంలోకి దిగి.. అఖిల్ రెండో సినిమాకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తాడని చెప్పాడు. కాని ఆ సినిమా కూడా ఇంకా పట్టాలెక్కలేదు. ఈ మధ్యనే విక్రమ్ పెళ్ళి చేసుకున్నాడు కాబట్టి.. సినిమా మొదలవ్వడానికి టైమ్ పడుతోందట.

ఇప్పుడు మనం అసలు మ్యాటర్ లోకి వస్తే.. అఖిల్ అప్పుడే తన మూడవ సినిమా గురించి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. షాకింగ్ విషయం ఏంటంటే.. బోయపాటి శ్రీను డైరక్షన్లో ఇప్పుడు అఖిల్ తన 3వ సినిమాను చేయడానికి ఒప్పుకున్నాడని అంటున్నారు. పైగా ఈ సినిమా రొటీన్ గా బోయపాటి తీసే మాస్ సినిమా కాదట. ఒక సరిక్రొత సైన్స్ ఫిక్షన్ కథను ఇప్పుడు బోయపాటి హ్యాండిల్ చేస్తున్నాడని అంటున్నారు. మొన్నటివరకు కత్తులతో రత్తాలు చిందించేసిన బోయాపటి.. ఇప్పుడు అసలు సైన్స్ ఫిక్షన్ను ఎంతవరకు హ్యాండిల్ చేస్తాడు.. పైగా అందులో అఖిల్ ఎంతవరకు సెట్టవుతాడు అనేది అందరి సందేహం. చూద్దాం ఈ రూమర్లన్నీ ఏ మలుపు తిరుగుతాయో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News