బోయపాటి అన్నయ్య యాంగిల్ ఒకటుంది

Update: 2016-10-27 07:30 GMT
దర్శకుడు బోయపాటి శ్రీను గురించి ఇటు పోసాని కృష్ణ మురళి కాని.. అటు ఆయన కజిన్ కొరటాల శివ కాని.. ఏ రేంజులో ఫైర్ అయ్యారో మనకు తెలిసిందే. అయితే బోయాపటి కూడా అందుకు స్పందించేసి ఉంటే.. ఆ సీన్ ఇంకోలా ఉండేది. కాని ఎప్పుడైతే మన సింహా అండ్ సరైనోడు డైరక్టర్ చాలా కామ్ గా ఉంటున్నాడో.. అది ప్రళయం కంటే ప్రమాదకరంగా కనిపిస్తోంది. అందుకే మనోడు అప్పుడు నోరిప్పుతాడు ఇప్పుడు నోరిప్పుతాడు అంటూ రోజుకోసారి వినిపిస్తూనే ఉంది.

అదంతా ఒకెత్తయితే.. అసలు బోయపాటికి లైఫిచ్చింది పోసాని అని.. ఆ తరువాత అతడ్ని దర్శకుడిగా నిలబెట్టింది కొరటాల శివ మాటలే అని నమ్మేవారు ఎంతమంది ఉన్నారో.. నమ్మనివారు కూడా అంతమందే ఉన్నారు. సరైనోడు సినిమా చూస్తే ఆ విషయం అర్దమవుతుంది. పోసాని యాక్టింగూ చేయలేదు.. కొరటాల మాటలూ రాయలేదు. అయినారే బోయపాటి వీరిని ఎక్సప్లాయిట్ చేశాడంటే.. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా కూడా.. అసలు బోయపాటి ఫ్యామిలీ సైడ్ నుండి జనాలకు తెలియని ఒక యాంగిల్ ఉందట.

అదేంటంటే.. బోయపాటి శ్రీనుకు బోయపాటి బ్రహ్మయ్య అని ఒక అన్నయ్య ఉన్నాడు. అసలు పోసాని గుంటూరు జిల్లా నుండి చెన్నయ్ వరకు వెళ్ళి సినిమా ఇండస్ర్టీలో స్థిరపడటానికి సాయం చేసింది ఈయనేనట. పోసాని ఒక మాటకు కూడా ఎప్పుడూ బ్రహ్మయ్య పేరు చెప్పకపోవడం బోయపాటి శ్రీనును కూడా బాగా బాధించిందట. ఆయన కూడా ఈ యాంగిల్ లో పోసానిపై ప్రతిదాడి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News