బోయపాటి అతడితోనే పక్కా..

Update: 2016-04-25 07:51 GMT
కెరీర్ ఆరంభం నుంచి స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు బోయపాటి శ్రీను. రవితేజతో తొలి సినిమా చేశాక.. వరుసగా విక్టరీ వెంకటేష్.. నందమూరి బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్ లతో సినిమాలు చేశాడు. బన్నీ లాంటి బిగ్ స్టార్ తో సినిమా చేశాక ఇంకా పెద్ద హీరో కోసం చూస్తాడేమో అనుకుంటే స్టార్ ఇమేజ్ లేని ఓ చిన్న హీరోతోనే తన తర్వాతి సినిమా చేయడానికి సిద్ధమైపోయాడు బోయపాటి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి తర్వాతి సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాను నిర్మించబోయే అభిషేక్ నామా.. ఈ విషయాన్ని కన్ఫమ్ చేస్తూ ఈ రోజు ప్రకటన కూడా ఇచ్చాడు.

సోమవారం బోయపాటి పుట్టిన రోజు. ఈ సందర్భంగా బోయపాటికి విషెస్ చెబుతూ తమ సినిమాను కన్ఫమ్ చేస్తూ ఓ ప్రకటన ఇచ్చాడు. ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూషన్ సంస్థగా ఉన్న ‘అభిషేక్ పిక్చర్స్’ బోయాపాటి-బెల్లంకొండ సినిమాతో నిర్మాణ సంస్థగా మారుతోంది. తమ సంస్థ నుంచి రాబోతున్న ‘ప్రొడక్షన్ నెంబర్.1’ అంటూ ఈ సినిమా గురించి కన్ఫర్మేషన్ ఇచ్చాడు అభిషేక్. అంతే కాక తమ కార్యాలయంలో బోయపాటి శ్రీను జన్మదిన వేడుకలు కూడా నిర్వహించాడు. బోయపాటితో కేక్ కట్ చేయించాడు. ‘అల్లుడు శీను’తో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమయ్యాక అతడితో బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్మెంట్ కుదిరింది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడ్డప్పటికీ.. ‘సరైనోడు’ తర్వాత తన హామీని నిలెబట్టుకోవడానికే రెడీ అయ్యాడు బోయపాటి. ఇప్పటిదాకా స్టార్ హీరోల్ని తనదైన శైలిలో ప్రెజెంట్ చేసిన బోయపాటి.. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి అప్ కమింట్ హీరోను ఎలా చూపిస్తాడో చూడాలి.
Tags:    

Similar News