బోయపాటి ఇరుక్కుపోడు కదా..
పాపం బోయపాటి శ్రీను.. లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్టిచ్చాక ఇప్పటికి 15 నెలలు గడిచిపోయాయి. కానీ ఇంకా అతడి తర్వాతి సినిమా మొదలు కాలేదు. ముందు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా పేరుతో కొంత కాలం గడిచిపోయింది. ఆ తర్వాత అది క్యాన్సిల్ అయి... అల్లు అర్జున్‌తో సినిమా కన్ఫమ్ అయి కూడా మూణ్నాలుగు నెలలవుతోంది. కానీ ఇంకా ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లలేదు. అల్లు అరవింద్ స్క్రిప్టులో మార్పులు కోరడం వల్లే ఈ లేట్ అని అంటున్నారు. కానీ నెలలు గడుస్తున్నా ఏమీ తెమలడం లేదు. సినిమా ఇప్పుడిప్పుడే మొదలయ్యేలా కనిపించడం లేదు.
లెజెండ్ బాలయ్య 97వ సినిమా కాగా.. 98వ సినిమా లయన్ మొదలుపెట్టి దాన్ని విడుదల చేసేశాడు. 99వ సినిమా డిక్టేటర్ కూడా మొదలైపోయింది. శ్రీవాస్, కోన వెంకట్ టీమ్ స్క్రిప్టు విషయంలో చాలా పక్కాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదే సినిమా పూర్తి చేసేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే వచ్చే ఏడాది ప్రథమార్ధానికి బాలయ్య ఖాళీ అయిపోతాడు. బాలయ్య వందో సినిమాకు బోయపాటే దర్శకుడని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య కూడా అతడే ఉండాలని కోరుకుంటున్నాడు. బోయపాటికీ చాలా ఆశే ఉంది. అలాంటపుడు బాలయ్య ఖాళీ అయ్యేలోపు మనోడు కథతో రెడీగా ఉండాలి. కానీ అప్పటికి బన్నీ సినిమా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కథ, స్క్రిప్టు విషయంలో తాను హడావుడి పడనని.. ఒక సినిమా పూర్తయ్యాక ఆరేడు నెలలు కూర్చుని స్క్రిప్టు రెడీ చేసుకుంటానని చెబుతుంటాడు బోయపాటి. అందులోనూ బాలయ్య వందో సినిమా కాబట్టి ఇంకా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూస్తే ఈపాటికే ఆ స్క్రిప్టు పని మొదలుపెట్టి ఉండాలి. కానీ బన్నీ సినిమా విషయంలోనూ కిందా మీదా పడుతున్నాడు. ఇలా ఉంటే బాలయ్య వందో సినిమా ఛాన్స్ మనోడికి దక్కుతుందో దక్కదో?