ఒకేసారి రాజశేఖర్ ఇద్దరు కూతుర్లతో రొమాన్స్ చేయబోతున్న హీరో
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు శివాని మరియు శివాత్మికలు సుపరిచితమే. శివాత్మిక ఇప్పటికే దొరసాని సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో కూడా శివాత్మిక కీలక పాత్రలో నటిస్తోంది. శివాత్మిక కంటే ముందు పెద్దమ్మాయి అయిన శివాని సినిమా ప్రారంభం అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ మద్యలో ఆగిపోయింది. మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న శివాని ఎట్టకేలకు ఒక సినిమాకు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది.
చీకటి గదిలో చితక్కొట్టుడు అనే బూతు సినిమాలో నటించి బూతు హీరోగా పేరు దక్కించుకున్న యంగ్ హీరో అరుణ్ అదిత్ ప్రస్తుతం రెండు సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు. అందులో మొదటిది ఫెయిర్ వెల్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పెద్దమ్మాయి శివాని హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అరుణ్ అదిత్ 'ఫెయిర్ వెల్' సినిమాతో పాటు 'విధి విలాసం' అనే మరో సినిమాను కూడా చేస్తున్నాడు. ఆశ్చర్యకర విషయం ఏంటీ అంటే ఈ సినిమాలో రాజశేఖర్ చిన్న కూతురు 'దొరసాని' శివాత్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యంగ్ హీరో ఒకేసారి హీరో కూతుర్లు ఇద్దరితో రొమాన్స్ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. శివాని మరియు శివాత్మికల్లో ఎవరికి అరుణ్ అదిత్ వల్ల సక్సెస్ వస్తుందో చూడాలి. ఆ ఇద్దరు నటిస్తుండటం వల్ల అరుణ్ అదిత్ ల రెండు సినిమాలకు కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. రెండు సినిమాలు కూడా స్వల్ప వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.