ఆ దర్శకుడిని నేను నమ్మను: నిర్మాత బోనికపూర్

Update: 2021-02-11 08:30 GMT
చిత్రపరిశ్రమలో సీనియర్ నిర్మాతలలో ఒకరు బోనీ కపూర్. ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు నటుడుగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవలే బోనీ లవ్ రంజన్ అనే సినిమాకు సంతకం చేసాడు. ఈ వినోదభరిత సినిమాలో బోని ఫుల్ లెన్త్ పాత్రలో కనిపించనున్నాడట. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బోనికపూర్ చాలా గ్యాప్ తర్వాత నిర్మాతగా బిజీ అయ్యాడు. స్టార్ యాక్టర్ అజయ్ దేవ్‌గన్‌తో మైదాన్ అనే చిత్రం నిర్మించాడు బోని. ఈ ఏడాది అక్టోబర్ 15న మైదాన్ సినిమా తెరపైకి వస్తుందని తెలిసిందే. అయితే దర్శకధీరుడు రాజమౌలి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ కూడా అదే నెలలో అంటే అక్టోబర్ 13న విడుదలవుతోంది. అయితే ఈ విషయం బోనీ కపూర్‌ను నిరాశపరిచింది. బోనీ ఇప్పటికే రాజమౌలి నిర్ణయంపై స్పందించాడు.

తాజాగా బోని ఫోర్బ్స్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. బోని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొనే మైదాన్ రిలీజ్ డేట్ ప్రకటించినట్లు తెలిపాడు. కానీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయం షాక్ కు గురించేసిందట. నిజానికి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అజయ్ దేవగన్ కు కూడా తెలియకుండా ప్రకటించడం అన్యాయంగా పేర్కొన్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ విషయం రాజమౌళి తనచేతిలో లేదని నిర్మాతనే నిర్ణయించినట్లు చెప్పాడట. కానీ "నేను రాజమౌలిని నమ్మడానికి నిరాకరిస్తున్నాను" అని బోనీకపూర్ వెల్లడించాడు. బాహుబలిలో శివగామి పాత్రకోసం రాజమౌళి శ్రీదేవిని సంప్రదించాడు. కానీ కుదరలేదు. గతంలో వారి మధ్య అపార్థాలు ఉన్నప్పటికీ రాజమౌళి చెప్పినవి కరెక్ట్ కాదని చెబుతున్నాడు ఈ నిర్మాత. అయితే మైదాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేసాడు.
Tags:    

Similar News