సల్మాన్‌ కేసులో ఏం జరుగుతోంది?

Update: 2015-07-01 12:55 GMT
రెండు నెలల క్రితం హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సల్మాన్‌ ఖాన్‌కు ముంబయి సెషన్స్‌ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష వేసేసరికి బాలీవుడ్‌ మొత్తం ఒక్కసారిగా షేక్‌ అయిపోయింది. సల్మాన్‌ గొప్ప మానవతా వాది అని.. అతడి మీద పెట్టుబడి పెట్టిన నిర్మాతలేమైపోవాలని తెగ బాధపడిపోయారు జనాలు. వాళ్ల ఆవేదన చూసి ఆ దేవుడు కూడా కరిగిపోయాడో ఏమో.. బొంబాయి హైకోర్టులో సల్మాన్‌ కింది కోర్టు తీర్పుపై అప్పీల్‌ చేసుకోగానే.. శిక్ష ఆగిపోయేలా చేశాడు. సెషన్స్‌ కోర్టు తీర్పును సస్పెండ్‌ చేసి కేసును మళ్లీ విచారించాలంటూ సంచలన తీర్పు ఇచ్చింది బాంబే హైకోర్టు.

ప్రస్తుతం సల్మాన్‌ బెయిల్‌ మీద ఉన్నాడు. ఎంచక్కా షూటింగుల్లో పాల్గొంటున్నాడు. ఐతే కేసు విషయంలో ఏం జరుగుతోందన్న అప్‌డేటే లేదు. ఐతే సల్మాన్‌కు శిక్ష నిలుపుదల చేసిన తర్వాత దాదాపు రెండు నెలలకు బాంబే హైకోర్టులో మళ్లీ కేసు విచారణకు వచ్చింది. మళ్లీ ఇప్పుడు మొదటి నుంచి కథ మొదలవుతుందన్నమాట. ఐతే బుధవారం విచారణలో ఏమీ తేలలేదు. జులై 13కు కేసు విచారణ వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. విచారణ మొదలవుతుండగా.. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించడానికి మూడు వారాల గడువు కావాలని సల్మాన్‌ తరఫు న్యాయవాది కోరగా.. న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ కేసు విచారణను వాయిదా వేశారు. సల్మాన్‌ తరఫు న్యాయవాది ఊరికే కాలయాపన చేయడానికే ఈ గడువు కోరుతున్నారని.. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చేసిన వాదనను కోర్టు అంగీకరించలేదు.

Tags:    

Similar News