సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌పై సీబీఐ ద‌ర్యాప్తు?

Update: 2020-06-15 03:30 GMT
బాలీవుడ్ యువ‌హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన పరిణామం. ఈ ఆదివారం ఉదయం ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం క‌ల‌క‌లం రేపింది. 34 ఏళ్ల నటుడి మృతికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు పోలీసు కమిషనర్ మనోజ్ శర్మ తెలిపారు.

అయితే ఇది ఆత్మ‌హ‌త్య కాదు.. హ‌త్య!! అంటూ సుశాంత్ మేన‌మామ ఆరోపించారు. తన మేనల్లుడు ఆకస్మిక మరణంపై ఆయ‌న సందేహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పీఎం నరేంద్ర మోదీ స్వ‌యంగా పూనుకుని సీబీఐ దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేసారు.

ఇది హ‌త్య అంటూ రాజ్ పుత్ మ‌హాస‌భ స‌భ్యులు సందేహం వ్య‌క్తం చేయ‌డ‌మే గాక సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల్సిందిగా కోరుతున్నారు. సుశాంత్ అభిమానులైన బీహారీ యువ‌కులు దీనిపై డిమాండ్ చేస్తున్నారు.  ఈ హత్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా - ప్రధాని నరేంద్ర మోదీ స్వ‌యంగా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతున్నాం`` అంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి. ఆ మేర‌కు ప్ర‌ముఖ మీడియాలు ఈ విష‌యాన్ని వెల్ల‌డించాయి.
Tags:    

Similar News