బాలీవుడ్‌ క్రాక్‌ సగం క్లారిటీ

Update: 2021-02-21 00:30 GMT
సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'క్రాక్‌' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కరోనా లాక్‌ డౌన్‌ తర్వాత టాలీవుడ్‌ లో మొదటి హిట్‌ గా క్రాక్‌ నిలిచింది. నిరాశ నిస్పృహల్లో ఉన్న ఇండస్ట్రీకి క్రాక్‌ హిట్‌ మంచి జోష్‌ ను ఇచ్చింది అనడంలో సందేహం లేదు. విపత్తు సమయంలో సూపర్‌ హిట్‌ గా నిలవడంతో పాటు ఎంతో మందికి కూడా ఆదర్శంగా నిలిచి ధైర్యంను ఇచ్చింది. అందుకే క్రాక్‌ సినిమా బాలీవుడ్‌ రీమేక్‌ గురించి అందరిలో ఆసక్తి నెలకొంది. తెలుగు లో రవితేజ పోషించిన పాత్రను బాలీవుడ్‌ స్టాయ్ హీరో చేస్తాడనే వార్తలు వస్తున్నాయి.

మొన్నటి వరకు క్రాక్‌ సినిమా రీమేక్‌ కోసం బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌ తో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా కష్టమే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని స్పందిస్తూ క్రాక్‌ సినిమా రీమేక్‌ విషయమై స్పందిస్తూ మొదట అజయ్‌ దేవగన్‌ తో చర్చలు జరిపాం. ఆయన కాకుంటే రణ్వీర్‌ సింగ్‌ ను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. అంటే వీరిద్దరు హీరోల్లో ఎవరో ఒకరు అని మాత్రం తేలిపోయింది. హీరో విషయమై సగం క్లారిటీ రాగా షూటింగ్‌ విషయమై త్వరలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News