#చ‌క్క‌న‌మ్మ‌లు.. కోట్లు కొల్ల‌గొట్టే బ్రాండ్ ప‌బ్లిసిటీ సీక్రెట్ లీక్

Update: 2021-02-02 17:30 GMT
అందాల భామ‌ల జిమ్ లుక్ వెన‌క టాప్ సీక్రెట్ లీకైంది. అన‌న్య‌.. జాన్వీ.. ఖుషీ.. సారా.. వంటి న‌ట‌వార‌స నాయిక‌ల హ‌వా .. వీళ్ల‌తో పాటు మ‌లైకా.. దిశా.. ప్ర‌గ్య ఇలా భామ‌ల నిరంత‌ర ఇన్ స్టా ట్రీట్ గురించి ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ వెన‌క అస‌లు గుట్టు తెలిసిపోయింది. జిమ్ కి వెళుతూ యోగా క్లాసుల‌కు వెళుతూ టైట్ స్పోర్ట్ దుస్తుల్లో న‌ట‌వార‌సురాళ్లు ఇస్తున్న ట్రీట్ వెన‌క మ‌ర్మం ఏమిటో క‌నిపెట్టేశాం.

మ‌రీ అంత‌గా ఖ‌రీదైన స్పోర్ట్ దుస్తుల్లోనే ఈ భామ‌లంతా సంద‌డి చేయ‌డం వెన‌క లాజిక్ ని ఆరా తీస్తే షాకిచ్చే నిజాలు తెలుస్తున్నాయి. ల‌క్ష‌ల్లో వీటి వెల ఉంటుందంటే.. ఇదంతా కోట్లాది రూపాయ‌ల విలువ చేసే బ్రాండ్ ప్ర‌మోష‌న్ అని తేలింది. ఫ‌లానా బ్రాండ్ ఇదీ అని జ‌నం చ‌ర్చించుకుంటేనే అది వంద‌ల కోట్ల బిజినెస్ కి తెర తీస్తుంది. ఈ భామ‌ల ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ వెన‌క అంత పెద్ద సీక్రెట్ ఉంద‌న్న చ‌ర్చ సాగుతోంది.

ప్ర‌ఖ్యాత కెల్విన్ క్లెయిన్ కి దిశా ప‌టానీ ప్ర‌చారం చేయ‌గా.. డీజెల్ కి కంచె బ్యూటీ ప్ర‌గ్య ప్ర‌చారం చేస్తోంది. ఇవే దుస్తుల‌కు ఇంత‌కుముందు మ‌లైకా అరోరాఖాన్ ప్ర‌చారం చేసి పెట్టింది. ర‌క‌ర‌కాల లోదుస్తుల‌ బ్రాండ్ల‌కు మ‌లైకా ప్ర‌చారం చేస్తోంది.

అనన్య పాండే యోగాకు వెళ్ళేటప్పుడు ఓ స్పెష‌ల్ బ్రాండ్ ని ప్ర‌మోట్ చేస్తోంది. మలైకా అరోరా వ్యాయామంతో కొత్త వీకెండ్ స్టార్ట‌య్యిందంటే దాని వెన‌క కోట్లాది రూపాయ‌ల బిజినెస్ సాగుతోంద‌నే అర్థం. అనన్య పాండే - మలైకా అరోరా ఈ రోజు యోగా అలాగే జిమ్ తరగతులకు వెళుతూ ఖ‌రీద‌న ఫ్లెక్సీ స్పోర్ట్ దుస్తుల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ప్ర‌స్తుతం బి-టౌన్  ఫిట్నెస్ డైరీలో హాటెస్ట్ గాళ్స్ గా ఆ ఇద్ద‌రి హ‌వా సాగుతోంది. ఇత‌ర భామ‌లు ఆ ఇద్ద‌రికీ ఎందులోనూ త‌గ్గ‌డం లేదు మ‌రి.
Tags:    

Similar News