బాలీవుడ్ స్టార్స్ అంతా మనోళ్ల దారిలోనే..!
ఒకప్పుడు బాలీవుడ్ స్టార్స్ సౌత్ హీరోలను కాని దర్శకులను కాని పట్టించుకునే వారు కాదు. సౌత్ సినిమాలంటే అప్పట్లో వారికి చిన్న చూపు ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోలు మరియు నిర్మాతలు అంతా కూడా సౌత్ దర్శకుల వెంట పడుతున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సౌత్ దర్శకులతో సినిమా చేయగా అక్షయ్ కుమార్ ప్రస్తుతం లారెన్స్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా పలువురు స్టార్స్ కూడా సౌత్ స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు.
అదే దారిలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా సౌత్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు దాదాపుగా పూర్తి అయ్యాయి. చేసిన అన్ని సినిమాలను సూపర్ హిట్ చేసుకున్న అట్లీ కుమార్ హిందీలో షారుఖ్ ఖాన్ కు సక్సెస్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. గత పది సంవత్సరాలుగా షారుఖ్ ఖాన్ కెరీర్ ఆశాజనకంగా లేదు. చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వచ్చింది.
షారుఖ్ చివరగా జీరో చిత్రం చేశాడు. ఆ సినిమా షారుఖ్ ఖాన్ కు మరింత పెద్ద షాక్ ఇచ్చింది. జీరో చిత్రం విడుదల అయ్యి దాదాపుగా రెండు సంవత్సరాలు కాబోతుంది. ఇన్నాళ్లు తదుపరి చిత్రంపై నిర్ణయం తీసుకోని షారుఖ్ ఖాన్ ఎట్టకేలకు అట్లీ దర్శకత్వంలో తదుపరి చిత్రంకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు. అన్ని అనుకున్నట్లుగా ఈ ఏడాది చివర్లోనో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలోనే వీరి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇతర స్టార్స్ కు ఇచ్చినట్లుగా బాద్ షాకు కూడా మనోడు సక్సెస్ ఇస్తాడా చూడాలి.