#NCB డ్ర‌గ్స్ కుంభ‌కోణంలో హీరోయిన్ మాజీ మేనేజ‌ర్ అరెస్ట్

Update: 2021-01-10 04:30 GMT
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ‌ల‌వ‌న్మ‌రణ కేసులో కొనసాగుతున్న దర్యాప్తున‌కు సంబంధించి బాలీవుడ్ క‌థానాయిక దియా మీర్జా మాజీ మేనేజర్ రహీలా ఫర్నిచర్ వాలాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) శనివారం అరెస్టు చేసింది.

గంజా దుర్వినియోగానికి పాల్ప‌డుతున్న ర‌హీలాను త‌న‌  సోదరిని అరెస్టు చేసినట్లు ఎన్‌.సి.బి ఒక నివేదికను విడుదల చేసింది. ఎన్‌.సిబి స్టేట్మెంట్ ప్ర‌కారం.. నిర్దిష్ట సమాచారం ఆధారంగా.. బాంద్రా వెస్ట్ ‌లోని ఒక కొరియర్ నుండి ఎన్‌.సి.బి ముంబై గంజాను స్వాధీనం చేసుకుంది. తదుపరి ఆపరేషన్ ‌లో జస్వంత్ హైట్స్ నివాసి నుండి గంజా దిగుమతి చేసుకున్నార‌ని తేలింది. అక్క‌డ‌కు చేరిన డ్ర‌గ్స్ భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఖర్ వెస్ట్ పేరు కరణ్ సజ్నాని (బ్రిటిష్ నేషనల్) విచార‌ణ‌లోనూ ముంబై జోనల్ యూనిట్ దర్యాప్తులోనూ రాహిలా ఫర్నిచర్ వాలా అనుమానితులుగా ఉన్నారు. రాహిలా ఫర్నిచర్ వాలా నుండి ప్ర‌తిదీ స్వాధీనం చేసుకున్నారు. రాహిలా ఫర్నిచర్ వాలా సోదరి  షైస్టా ఫర్నిచర్ వాలా వ‌ద్ద‌ కూడా గంజా ఉన్నట్లు నిర్ధార‌ణ అవ్వ‌డంతో ఎన్.సి.బి అరెస్టు చేసింది. సుమారు 200 కిలోల గాంజా వీరి వ‌ద్ద ప‌ట్టుబ‌డింది.

కరణ్‌ సజ్నాని ముందస్తుగా గంజా జాయింట్ల రూపంలో ప్యాక్ చేసి రెడీగా ఉంచారు. దీనిని ముంబై  ఇతర రాష్ట్రాలలో ఉన్నత-తరగతి ఖాతాదారులకు విక్రయించిన‌ది. స్మగ్లింగ్ కార్యకలాపాలకు ఆర్థిక మ‌ద్ధ‌తు.. అలాగే ఇతర సౌక‌ర్యాలను అందించడం ద్వారా రాహిలా ఫర్నిచర్ వాలా పెద్ద నేరాలు చేశారు. ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటీమ‌ణులు దీపికా పదుకొనే- సారా అలీ ఖాన్- శ్రద్ధా కపూర్ - రకుల్ ప్రీత్ సింగ్ త‌దిత‌రుల్ని కూడా ఎన్.‌సి.బి ప్రశ్నించిన సంగ‌తి తెలిసిన‌దే.
Tags:    

Similar News