టాలీవుడ్ మాస్ దర్శకుడి బాలీవుడ్ డెబ్యూ పరిస్థితేంటి..?
టాలీవుడ్ లో మాస్ అండ్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వివి వినాయక్. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన వినాయక్.. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ - హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ తో మెప్పించడంలో సిద్ధహస్తుడు. దాదాపు స్టార్ హీరోలందరికీ సూపర్ హిట్ చిత్రాలను అందించారు. అయితే 'ఇంటలిజెంట్' ప్లాప్ తర్వాత వినాయక్ నుంచి మరో మూవీ రాలేదు.
కొంతకాలం గ్యాప్ తర్వాత వినాయక్ ఇప్పుడు హిందీ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇది దర్శకధీరుడు రాజమౌళి - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'ఛత్రపతి' చిత్రాన్ని అధికారిక హిందీ రీమేక్. తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించిన వి.వి.వినాయక్.. ఈ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నారు. 'అల్లుడు శీను' తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను హీరోని చేసిన అగ్ర దర్శకుడు.. ఇప్పుడు బాలీవుడ్ కు పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు.
అప్పుడెప్పుడే సెట్స్ మీదకు వెళ్లిన 'ఛత్రపతి' హిందీ రీమేక్ కరోనా నేపథ్యంలో ఆలస్యమవుతూ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమా సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయిందని తెలుస్తోంది. కేవలం పాటలు మాత్రమే మిగిలి ఉండగా.. మంగళవారం ఒక పాట షూటింగ్ కూడా ప్రారంభమైంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఇంతకముందు 'ఠాగూర్' 'ఖైదీ నెం. 150' వంటి సక్సెస్ ఫుల్ రీమేక్స్ ని తెరకెక్కించిన వినాయక్.. ఇప్పుడు 'ఛత్రపతి' చిత్రాన్ని హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో సాలిడ్ ఎంట్రీ ఇస్తారని అభిమానులు భావిస్తున్నారు. హీరో బెల్లంకొండ సైతం ఈ సినిమా తనకు పర్ఫెక్ట్ బాలీవుడ్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.సాధారణంగా సినిమాలను చాలా ఫాస్ట్ గా తెరకెక్కించే వినాయక్.. ఈ సినిమా కోసం కాస్త ఎక్కువ సమయమే కేటాయిస్తున్నారు.
ఒరిజినల్ స్టోరీ రైటర్, రాజమౌళి తండ్రి కె.వి.విజయేంద్ర ప్రసాద్ ఈ హిందీ రీమేక్ వెర్షన్ కు కథ అందిస్తున్నారనే సంగతి తెలిసిందే. హిందీ ప్రేక్షకుల అభిరుచులకు, సెన్సిబిలిటీస్ కి అనుగుణంగా స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది. అయితే దీన్ని మరింత రేసిగా మార్చడానికి దర్శకుడు వివి వినాయక్ సినిమా సెకండాఫ్ లో కొన్ని కీలక మార్పులు చేశారని టాక్ నడుస్తోంది.
ఇకపోతే ఇందులో సాయి శ్రీనివాస్ సరసన నటించే హీరోయిన్ ని ఇంకా ప్రకటించలేదు. 'సోనా కే టిటు కీ స్విట్' ఫేమ్ నుస్రత్ బరూచా హీరోయిన్ రోల్ ప్లే చేస్తోందని సమాచారం. పెన్ స్టూడియోస్ - పెన్ మారుధర్ సినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ధవల్ జయంతిలాల్ గడ - అక్షయ్ జయంతిలాల్ గడా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజార్ అలీ షఫీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తనీష్ బాగ్చి సంగీతం సమకూరుస్తున్నారు. మరి 'ఛత్రపతి' రీమేక్ వినాయక్ - బెల్లంకొండ హీరోకి హిందీలో ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.