2021 బాక్సాఫీస్ బెట్టింగ్.. 1600 కోట్లలో స్టార్ హీరో వాటా 530కోట్లు
2020 జ్ఞాపకాల్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. మహమ్మారీ వల్ల కఠోర వాస్తవాల్ని జీర్ణించుకుని కొత్త సంవత్సరానికి వెల్ కం చెప్పాం. 2021లో పరిస్థితి మెరుగైంది. ఇక ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 1600 కోట్ల బెట్టింగ్ సాగుతోంది. దాదాపు 15 సినిమాలకు ఇంత పెద్ద మొత్తం ఖర్చవుతుంటే.. బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ తాను నటించి నిర్మించే వాటికి ఏకంగా 530 కోట్లు పెడుతుండడం ఒక సాహసం అనే చెప్పాలి. కానీ అదంతా అతడి తెలివైన పెట్టుబడిగా పరిగణించాల్సి ఉంటుంది. అతడి నుంచి ఈ ఏడాది వరుస చిత్రాలు ట్రీటివ్వనున్నాయి.
బాలీవుడ్ క్రేజీ చిత్రాలు సూర్యవంశీ .. 83 చిత్రాలు 2020 లో రావాల్సినవి 2021కి వాయిదా పడ్డాయి. షంషేరా - మైదాన్ ఈ ఏడాదిలోనే రిలీజ్ కి రానుండడంతో వీటన్నిటి బడ్జెట్లు లెక్కిస్తే.. మొత్తం రూ. కేవలం 15 సినిమాల నుండి 2021 లో బాలీవుడ్‌లో 1300-1600 కోట్లు పందెం కాస్తున్నారని తెలిసింది.
పరిశ్రమకు రూ. లాభాల మార్జిన్ సాధించడానికి థియేట్రికల్ రిటర్న్స్ (ఇతర చిన్న సినిమాలను కూడా లెక్కించడం) నుండి 1900-2200 కోట్ల నెట్ కలెక్షన్ రావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే 2021 అత్యుత్తమ సంవత్సరంగా మారుతుంది. మహమ్మారీ పర్యవసానం ఇంకా కొనసాగితే ఇదంతా సాధ్యమయ్యే పరిస్థితి కానేకాదు.
కరోనావైరస్ మహమ్మారి వల్ల వేలాది కార్మికులు రోడ్డున పడ్డారు. మేకర్స్ కి నష్టాలొచ్చాయి. థియేట్రికల్ పాక్షిక షట్ డౌన్ తో బాక్సాఫీస్ పరంగా బాలీవుడ్ పడిపోయింది. మొదటి త్రైమాసికంలో ఏ విధమైన సానుకూలత లేదు. 2020 కేవలం మూడు సినిమాలను అందించింది. తన్హాజీ: ది అన్సంగ్ వారియర్ - మళంగ్ - శుబ్ మంగల్ జ్యదా సావ్ధాన్ ఆశించిన రీతిలో లాభాలు తెచ్చాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్ కార్డును పరిశీలిస్తే.. 2016-2019 సీజన్ తో పోలిస్తే ఇప్పుడు పూర్తి విరుద్ధంగా ఉంది రిజల్ట్.
ఏదేమైనా దాదాపు ఎనిమిది నెలల లాక్ డౌన్ ముప్పు తిప్పలు పెట్టింది. గ్యాప్ వల్ల ఇప్పటికి చిత్రీకరణలు పూర్తి చేసుకుంటున్నారంతా. కొన్ని పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. ఇవన్నీ 2021 లో తెరపైకి రానున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని బాలీవుడ్ మొత్తం నెట్ .. స్థూల సేకరణల పరంగా దాని అతిపెద్ద టర్నోవర్ ను చూడగలదని అంచనా ఏర్పడింది.
ఇతర రంగాలతో పోలిస్తే సినిమా వ్యాపారం భిన్నమైనది. రిస్క్ ఎల్లప్పుడూ పెద్దది. 2020 నుండి సూర్యవంశీ -83 వంటి వాటిని ఇప్పుడు పోటాపోటీగా ఒకేసారి రిలీజ్ చేయడం సాహసమే. వీటితో పాటు షంషేరా - మైదాన్ వంటివి పోటీపడడం సరైనదేనా? అంటే బాక్సాఫీస్ వద్ద పెద్ద అవకాశాన్ని దెబ్బతీస్తుందనేది ఒక వర్గం విశ్లేషణ.
2021 లో బాలీవుడ్ లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. వీటితో రిస్క్ ఎంతో విశ్లేషిస్తే..
*సూర్యవంశీ - రూ. 170-200 కోట్లు
*అట్రాంగి రే - రూ. 30-40 కోట్లు (అక్షయ్ కుమార్ నటన రుసుము డిజిటల్ ..శాటిలైట్ నుండి పొందాలి)
*బెల్ బాటమ్ - రూ. 45-50 (అక్షయ్ కుమార్ నటన రుసుము డిజిటల్ ..శాటిలైట్ నుండి పొందాలి)
*రక్షా బంధన్ రూ. 30-40 కోట్లు (అక్షయ్ కుమార్ నటన రుసుము డిజిటల్ మరియు ..శాటిలైట్ నుండి పొందాలి)
*పృథ్వీరాజ్ రూ. 180-200 కోట్లు
*మైదాన్ - రూ. 100+ cr
*మేడే - రూ. 60-80 కోట్లు (ఆప్రాక్స్)
* 83 - రూ. 200+ cr
*సర్దార్ ఉధమ్ సింగ్ - రూ. 30-35 కోట్లు
* షంషేరా - రూ. 150+ cr
* సత్యమేవ జయతే 2 - రూ. 70-80 కోట్లు
* జెర్సీ - రూ. 65-70
* రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ - రూ. 70-80 కోట్లు (సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నది). సల్మాన్ నటన వసూళ్లు తేవాలి.
*లాల్ సింగ్ చద్దా - రూ. 70-80 కోట్లు (అమీర్ ఖాన్ నిర్మిస్తున్నది. అతని ఛరిష్మా నటన పారితోషికాన్ని ఇవ్వాలి)
*పఠాన్ - రూ. 200 కోట్లు
ఈ జాబితాను సునిశితంగా పరిశీలిస్తే.. అక్షయ్ కుమార్ ఆధిపత్యం స్పష్ఠంగా కనిపిస్తోంది. జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు సినిమాలు ఆయనవే. అజయ్ దేవ్‌గన్ (రెండు సినిమాలు)- షారుఖ్ ఖాన్- సల్మాన్ ఖాన్ - అమీర్ ఖాన్ (ఒక్కొక్కటి) థియేటర్లలోకి వస్తుంటే.. ఐదుగురు సూపర్ స్టార్స్ పన్నెండు నెలల్లో ఒక్క సినిమాతోనే రేసులో ఉన్నారు.
రణవీర్ సింగ్-దీపికా పదుకొనే `83`.. షాహిద్ జెర్సీ తో 2021 లో ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న షంషెరా -సత్యమేవ జయతే 2 రేసులో చేరుతున్నాయి.. పైన పేర్కొన్న సినిమాలతో బాలీవుడ్లో ప్రవహించే మొత్తం డబ్బు రూ. 1300-1600 కోట్లు.
వాస్తవానికి పెద్ద స్టార్లకు శాటిలైట్ డిజిటల్ మార్కెట్లు.. సంగీతం నుండి పెద్ద వాటా దక్కుతోంది. 2021లో థియేట్రికల్ రిలీజ్ నుండి మాత్రమే పెద్ద మొత్తం రికవరీ కావాల్సి ఉంది. నిర్మాతలు పంపిణీదారులు ప్రదర్శనకారులు సంతోషంగా ఉండటానికి ఆ 15 సినిమాలు 1900-2200 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఒక రకంగా 2021 ఆర్థికంగా పెట్టుబడుల పరంగా ఎంతో సాహసోపేతమైనదిగా భావించాల్సి ఉంటుంది. ఆ పదిహేను కాకుండా ఇతర చిన్న మిడ్-బడ్జెట్ చిత్రాలను పరిగణనలోకి తీసుకుంటే ఇంకా పెట్టుబడి పెరుగుతుంది.