జాన్వీ త‌ర్వాత సారా కూడా రౌడీ ఖాతాలోకే!

Update: 2021-02-14 12:51 GMT
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కుమార్తె జాన్వీ క‌పూర్ ఫేవ‌రెట్ తెలుగు స్టార్ ఎవ‌రు? అంటే విజ‌య్ దేవ‌ర‌కొండ అని ఇంత‌కుముందు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌న రౌడీ రేంజు ఏ లెవ‌ల్లో ఉందో అంద‌రికీ అర్థ‌మైంది. ఇప్పుడు సారా అలీఖాన్ కూడా రౌడీ విజయ్ దేవరకొండతో ఫ్యాన్ మూవ్ మెంట్ ని ఆస్వాధించింది. ఆదివారం తెల్లవారుజామున సారా తన ఇన్ స్టాగ్రామ్ ‌లో విజయ్ తో దిగిన ఫోటోని పోస్ట్ చేసింది.

ఫోటోలో సెల్ఫీ క్లిక్ తో ఆ ఇద్దరూ స్మైలీ లుక్ తో క‌నిపించారు. విజయ్ బూడిద రంగు టీ-షర్టు ధరించి సింపుల్ గా క‌నిపిస్తున్నాడు. సారా బ్లాక్ దుస్తులలో అద్భుతంగా కనిపిస్తోంది. “ఫ్యాన్ మూవ్ మెంట్” అంటూ స్టిక్కర్ తో క్యాప్షన్ ఇచ్చింది సారా.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే విజయ్ ప్ర‌స్తుతం లైగ‌ర్ చిత్రంలో న‌టిస్తున్నాడు. సారా తదుపరి చిత్రం అట్రాంగి రే షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్- ధనుష్ క‌థానాయకులుగా న‌టిస్తున్నారు.




Tags:    

Similar News