• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇస్మార్ట్ హీరోతో బ్లాక్...

ఇస్మార్ట్ హీరోతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సినిమా..!

By - Tupaki Desk
Update: 2021-04-12 13:30 GMT
యంగ్ టాలీవుడ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ అంటే ఇదివరకు పరిచయం లేదేమోగాని ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అనుదీప్ అంటే జాతిరత్నం అనే గుర్తుపడతారు. అనుదీప్ డెబ్యూ చేసిన 'పిట్టగోడ' సినిమా అసలు ఎప్పుడు వచ్చిపోయిందో తెలియలేదు. కానీ సెకండ్ మూవీ 'జాతిరత్నాలు'తో మాత్రం అనుదీప్ తన పేరు అందరికి తెలిసేలా చేసాడు. ఎందుకంటే ఆ సినిమా చేసిన మ్యాజిక్ అలాంటిది. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శిలను ప్రధానపాత్రలలో పెట్టి తెరకెక్కించిన కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ జాతిరత్నాలు. ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ అందుకుంది. పెట్టిన బడ్జెట్ కు మూడింతల లాభం తెచ్చిపెట్టిందట. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ కామెడీ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్ గా డెబ్యూ చేసింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా అనుదీప్ తదుపరి సినిమా ఏంటి.. ఎవరితో అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కానీ తదుపరి సినిమా మాత్రం మాంచి మాస్ సినిమా తీయనున్నట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం.. డైరెక్టర్ అనుదీప్ టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేనిని కలిసి స్టోరీ లైన్ వినిపించినట్లు టాక్. అనుదీప్ చెప్పిన స్టోరీకి రామ్ కూడా అనుకూలంగా స్పందించి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయాలనీ కోరినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను స్రవంతి మూవీస్ తో పాటు వైజయంతి మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ మాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మరి అనుదీప్ సినిమా పై క్లారిటీ రావాల్సి ఉంది.
Tags:    
  • Jathi Ratnalu Director Anudeep 
  • Ismart Hero Ram 
  • Jaathi Ratnalu 
  • Tollywood 
  • Telugu News 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS