ఐకాన్ పోస్టర్ కూడా వచ్చేసిందోచ్!

Update: 2020-04-08 08:50 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి.  అంతే కాకుండా అల్లు అర్జున్ లైన్లో పెట్టిన మరో ప్రాజెక్ట్ 'ఐకాన్' పోస్టర్ కూడా విడుదల కావడం విశేషం.

'నా పేరు సూర్య' సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ అప్పట్లో మొత్తం మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో ఈ 'ఐకాన్' కూడా ఒకటి.  అయితే అల 'వైకుంఠపురములో' ముందుగా పట్టాలెక్కింది. రిలీజై సంచలన విజయం సాధించింది.  సుకుమార్ సినిమా 'పుష్ప' ప్రస్తుతం సెట్స్ పై ఉంది.  కానీ 'ఐకాన్' క్యాన్సిల్ అయిందని కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి. ఆ టాక్ కు తగ్గట్టే 'ఐకాన్' దర్శకుడు వేణు శ్రీరామ్ 'వకీల్ సాబ్' తో బిజీ కావడంతో ఇక 'ఐకాన్' లేనట్టేనని అందరూ అనుకున్నారు. అయితే ఈ రోజు వచ్చిన ప్రకటనతో 'ఐకాన్' ప్రాజెక్టు ఉందనే విషయం స్పష్టమయింది.

అల్లు అర్జున్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దిల్ రాజు బ్యానర్ అయిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ వారు ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు.  'ఐకాన్' టైటిల్ కాగా 'కనపడుట లేదు' అనేది క్యాప్షన్.  టైటిల్ కింద సిలౌట్ తరహాలో అల్లు అర్జున్ ఓ బుల్లెట్ బైక్ నడుపుతూ ఉన్నట్టుగా చూపించారు. ఈ సినిమా సుకుమార్ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్  కు ఇదో స్వీట్ సర్ ప్రైజ్ అనుకోవచ్చు.
Tags:    

Similar News