తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 సందడి షురూ.. కంటెస్టెంట్స్ వీళ్లే
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నేడు లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. గత నెల రోజులుగా బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను ఊరిస్తున్న ఈ షో కి సంబంధించిన హడావుడి ఇప్పటికే ప్రారంభం అయ్యింది. రెండు రోజులుగా కంటెస్టెంట్స్ ఎంట్రీ మరియు డాన్స్ పర్ఫార్మెన్స్ షూట్ చేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ గురించి చాలా రోజులుగా చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా అధికారికంగా క్లారిటీ లేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ ఫైనల్ జాబితా అంటూ ఒక లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కొందరు ఊహించని వారు ఉన్నారు.. కొందరు ఉంటారు అనుకున్న వారు లేరు.
సీజన్ 6 కంటెస్టెంట్స్ (లీక్) వీరే అంటున్నారు. చలాకీ చంటి... గీతూ రాయల్.. జబర్దస్త్ ఫైమా.. ఇనయా సుల్తానా.. వాసంతి కృష్ణన్.. ఐటెం గర్ల్ అభినయ శ్రీ.. నేహా చౌదరి.. అర్జున్ కళ్యాణ్.. ఆది రెడ్డి.. బాలాదిత్య.. మెరీనా.. రోహిత్.. శ్రీ సత్య... మోడల్ రాజశేఖర్.. ఆర్ జే సూర్య.. శ్రీహాన్ తో పాటు మరి కొందరి పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న ఉదయ భాను ఈ సీజన్ లో కూడా ఉండే అవకాశం లేదు అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది నేడు సాయంత్రం ప్రారంభం కాబోతున్న షో తో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 కి నాగార్జున సౌత్ బిగ్ బాస్ హోస్ట్ ల్లోనే అత్యధిక పారితోషికం ను తీసుకుంటున్నాడు. రేటింగ్ విషయంలో కూడా తెలుగు బిగ్ బాస్ టాప్ లో ఉంటుందని అంటున్నారు.