'ఎఫ్ 3' లో 'బిగ్ బాస్' విన్నర్..?
'బిగ్ బాస్ తెలుగు-4' రియాలిటీ షో టైటిల్ విన్నర్ గా నిలిచిన యువ హీరో అభిజీత్.. తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అభిజీత్.. ఆ తర్వాత 'మిర్చిలాంటి కుర్రాడు' 'రామ్ లీలా' వంటి సినిమాల్లో నటించాడు. వీటి వల్ల అభి కి పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీంతో సినిమాలకు దూరమైన అభిజీత్ బిగ్ బాస్ నాలుగో సీజన్ కు విన్నర్ గా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తూ బిజీగా గడుపుతున్న ఈ యంగ్ హీరోకి సినిమా ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయని తెలుస్తోంది. ఇటీవలే 'భీష్మ' దర్శకుడు వెంకీ కుడుములను కలిసిన అభి త్వరలోనే హీరోగా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఓ భారీ మల్టీస్టారర్ లో నటించబోతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన సూపర్ హిట్ 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో 'ఎఫ్ 3' సినిమా రానున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కి మోర్ ఫన్ యాడ్ చేస్తూ డబ్బు నేపథ్యాన్ని తీసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో 'ఎఫ్ 2' నటీనటులను కొనసాగిస్తూనే మరికొంతమంది కొత్తవాళ్ళని యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ‘F3' చిత్రంలో అభిజీత్ కీలక పాత్రను పోషించబోతున్నాడని ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. 'బిగ్ బాస్ 4' ఫైనల్ కి గెస్ట్ గా వెళ్లిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇప్పుడు అభి కి ఓ కీ రోల్ ఆఫర్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.