బిబి4 : అభిజిత్ దర్శకత్వంలో అఖిల్.. మోనాల్ 'ప్రేమ మొదలైంది'
బిగ్ బాస్ ఏడవ వారం కూడా ముగిసింది. నేడు రేపు వీకెండ్ ఎపిసోడ్స్ ప్రసారం కాబోతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే ఇంటి సభ్యులతో బిగ్ బాస్ ఒక సినిమా తీయమంటూ టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ సినిమాకు అభిజిత్ దర్శకత్వం వహించాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. సోహెల్, హారికలు ఐటెం సాంగ్ చేయాలని సూచించాడు. ఇక లాస్య స్టైలిష్ట్ అవినాష్ స్క్రిప్ట్ రైటర్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ దివి అసిస్టెంట్ డైరెక్టర్ నోయల్ డీఓపీలుగా వ్యవహరించాలంటూ టాస్క్ ఇచ్చిన సమయంలోనే బిగ్ బాస్ సూచించాడు. అఖిల్ మరియు మోనాల్ లు ఒక జంట మరియు అరియానా మరియు అవినాష్ లు ఒక జంట. ఇక మొహబూబ్ విలన్ గా కనిపించబోతున్నాడు. అలా మొత్తం టీం సెట్ అయ్యింది.
ఎప్పటిలాగే ఈ టాస్క్ లో కూడా చిన్న చిన్న గొడవలు వచ్చాయి. ముఖ్యంగా అమ్మ రాజశేఖర్ మరియు అభిజిత్ ల మద్య సీరియస్ చర్చ జరిగింది. ఆ తర్వాత అవినాష్ తన మాట వినడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అఖిల్ మరియు మోనాల్ ల మద్య రొమాంటిక్ సీన్ కు తాను దర్శకత్వం వహించాల్సి వచ్చింది అంటూ ఛీ దీనమ్మ జీవితం అంటూ అభిజిత్ కామెడీ చేశాడు. ఇక సోహెల్ మరియు హారికలు ఐటెం సాంగ్ ను అదరగొట్టారు. నిజంగా సినిమాలో ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ రెడీ అయినట్లుగా హారిక రెడీ అయ్యింది.
ఇంటి సభ్యులు కొన్ని సందర్బాల్లో సిల్లీగా వ్యవహరించినా ఒక మంచి సినిమాను తీసినట్లుగా అయితే అనిపించింది. సినిమా షూటింగ్ సందర్బంగా అవినాష్ కు కోపం వచ్చి నేను చేయను అంటూ వెళ్లిపోయాను. మొత్తానికి సినిమాను పూర్తి చేశారు. నేటి ఎపిసోడ్ లో వారు తీసిన సినిమాను ప్రీమియర్ వేయబోతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఇచ్చిన మరో టాస్క్ లో విజేతగా నిలిచినందుకు గాను దివికి గంట ఎక్కువ సమయం పడుకునే అవకాశంను బిగ్ బాస్ కల్పించాడు. మొత్తానికి శుక్రవారం ఎపిసోడ్ సరదా సరదాగా సాగిపోయింది.