• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #BB4 Day 1 : ఏడుపులు...

#BB4 Day 1 : ఏడుపులు గొడవలు.. నామినేషన్‌ లో గంగవ్వ

By - Tupaki Desk
Update: 2020-09-08 04:15 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 మొదటి ఎపిసోడ్‌ నుండే రచ్చ మొదలైంది. ఏడుపులు.. గొడవలతో పాటు గాసిప్స్‌ క్రియేట్‌ చేసుకోవడం ఒకరి గురించి మరొకరు చాటుగా తప్పుగా మాట్లాడుకోవడం వంటివి జరిగాయి. సాదారణంగా బిగ్‌ బాస్‌ లో ఇవన్నీ చాలా కామన్‌. కాని కొన్ని రోజుల తర్వాత మొదలవ్వాల్సిన గొడవలు మరియు ఏడుపులు మొదటి రోజే చూడాల్సి వచ్చింది. మోనాల్‌ గజ్జర్‌ కదిలిస్తే ఏడ్చేస్తుంది. ఇక దర్శకుడు సూర్య కిరణ్‌ కాస్త దూకుడు స్వభావం వల్ల చిక్కుల్లో పడ్డట్లయ్యాడు. ఇక మొదటి రోజే ఎలిమినేషన్‌ కు నామినేషన్స్‌ కూడా జరిగాయి.

మొదటి రోజు డాన్స్‌ తో స్టార్ట్‌ అయిన షో ఒకరి గురించి ఒకరు తెలుసుకునేందుకు కనెక్షన్‌ పెంచుకునేందుకు అంటూ ఒక గేమ్‌ ను షురూ చేయడం జరిగింది. అందులో చీట్టీల్లో ఉన్న విషయాలపై మాట్లాడాల్సి ఉంటుంది. మోనాల్‌ సొంత ఊరు గురించి చెప్పమంటే ఏదో ఏదో చెప్పి ఏడ్చేసింది. టాపిక్‌ అది కాదు అంటూ సూర్య కిరణ్‌ ఆమెకు తెలిపే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలోనే కంటెస్టెంట్స్‌ మద్య వాగ్వివాదం జరిగింది. అది పూర్తి అయ్యిన తర్వాత సీక్రెట్‌ రూంలో ఉన్న సోహెల్‌ మరియు అరియానాలు ఫోన్‌ చేసి ఇద్దరుకు సరిపోయేంత ఫుడ్‌ రెడీ చేసి స్టోర్‌ రూంలో పెట్టండి అంటూ చెప్పడంతో అంతా కూడా బిగ్‌ బాస్‌ అనుకున్నారు. కొందరు మాత్రం మరేవ్వరో అనుకున్నారు. ఫోన్‌ మాట్లాడిన సుజాత సరిగా మాట్లాడలేదు అంటూ కళ్యాణి అనడంతో గొడవ మొదలైంది. ఇద్దరి మద్య కాస్త ఎక్కువే గొడవ జరిగి సుజాత ఏడ్చేసింది.

ఆ తర్వాత నామినేషన్‌ పక్రియ మొదలు అయ్యింది. ఇప్పటికే 16 మందిని 8 జంటలుగా విడగొట్టారు. ఒక్క జంట సీక్రెట్‌ రూంలో ఉండగా 7 జంటలు ఎలిమినేషన్‌ లో నిలిచాయి. జంటకు ఒక్కరిని చొప్పున నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. ఇంటి సభ్యులు అందరు ఏకాభిప్రాయంతో నామినేట్‌ చేయాలంటూ సూచించారు. ఈ వారం నామినేషన్ లో నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభిజిత్‌.. సూర్య కిరణ్‌.. సుజాత.. దివి.. అఖిల్‌ సార్థక్‌.. మెహబూబ్‌.. గంగవ్వ లు నామినేట్‌ అయ్యారు. గంగవ్వ ఈజీగా ఓట్లు దక్కించుకుంటుందని ఆమెకు సమస్య లేదు కనుక ఆమె జోడీ అయిన నోయెల్‌ ను దాదాపు అంతా సేవ్‌ చేశారు. దాంతో గంగవ్వను నామినేషన్‌ లో ఉంచారు. గంగవ్వ అప్పుడు నామినేషన్స్‌ రావడం పట్ల నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వారం నామినేట్‌ అయిన వారిలో వీక్‌ అంటే దివి మరియు సూర్యకిరణ్‌ అనిపిస్తుంది. ఆ ఇద్దరిలో ఒకరు లేదంటే మరెవ్వరైనా ఎలిమినేట్‌ అవ్వచ్చు. మొదటి రోజు ఏడుపులు.. గొడవలతో షో అలా అలా సాగిపోయింది.
Tags:    
  • Bigg boss 
  • Bigg boss Season 4 
  • Tollywood 
  • Star Maa Bigg Boss 
  • Nagarjuna 
  • Tarun 
  • Tupaki News 
  • Mahesh Babu 
  • Tupaki Updates 

Similar News

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

Copyright @2026

Powered by Blink CMS