• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంస్టాలో హల్చల్ చేస్తున్న...

ఇంస్టాలో హల్చల్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్ వీడియో..!

By - Tupaki Desk
Update: 2021-05-29 09:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన యూట్యూబ్ స్టార్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు దీప్తి సునైనా. డబ్ స్మాష్ వీడియోస్ ద్వారా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యూట్యూబ్ మ్యూజిక్ వీడియోస్ - కవర్ సాంగ్స్ లో డాన్స్ చేసి మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ విధంగా పాపులర్ అయినటువంటి దీప్తి ఒక్కసారిగా బిగ్ బాస్ రియాలిటీ షో సెకండ్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి ఫేమ్ సంపాదించుకుంది. నిజానికి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేవారంతా ఏదోక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో పాపులర్ అయినవారే ఉంటారు. అయితే దీప్తి కెరీర్ బిగ్ బాస్ కు ముందు బిగ్ బాస్ తర్వాత అనే చెప్పుకోవాలి.

ఎందుకంటే బిగ్ బాస్ లోకి రాకముందు దీప్తి అంటే కేవలం యూట్యూబ్ యూసర్లకు మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే ఆ షోలో పాల్గొందో ఈ వయ్యారికి ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం వెబ్ సిరీసులు - మ్యూజిక్ వీడియోస్ - అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ మెరుస్తోంది. అయితే అందులో ఎక్కువగా దీప్తి మ్యూజిక్ వీడియో చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతుంది. హైదరాబాద్ కు చెందిన ఈ ఇరవై రెండేళ్ల వయ్యారి ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. ఖాళీ సమయం దొరికితే ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా సందడి చేస్తోంది. ప్రస్తుతం దీప్తి వీడియోస్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.

తాజాగా దీప్తి నటించిన ఓ ప్రైవేట్ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఎమోషనల్ లవ్ బ్రేకప్ నేపథ్యంలో రూపొందించిన ఆ మ్యూజిక్ వీడియోకు ఫ్యాన్స్ కుర్రకారు నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా దీప్తి చేసిన ఆ తట్టుకోలేదే సాంగ్ రీల్ వీడియో హల్చల్ చేస్తోంది. అయితే ఆ వీడియోలో దీప్తి ఎమోషనల్ యాక్టింగ్ చూస్తే ఖచ్చితంగా ఎవరైనా ఫిదా అవుతారు. ప్రస్తుతం సోషల్ మీడియా వరకే పరిమితం అయింది. కానీ దీప్తికి ఒకసారి సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్ గా కనిపించే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా అందమైన యాక్టింగ్ తో అందరికి బాగా కనెక్ట్ అవుతుందని సోషల్ మీడియాలో నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదివరకు దీప్తి కిరాక్ పార్టీ అనే సినిమాలో మెరిసింది. చూడాలి మరి త్వరలో ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్ తో సర్ప్రైజ్ చేస్తుందేమో!


Tags:    
  • Bigg Boss Beauty 
  • Bigg Boss Beauty emotional video 
  • instagram 
  • Deepthi sunaina 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS