• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్‌బాస్‌5 : సోనూసూద్‌...

బిగ్‌బాస్‌5 : సోనూసూద్‌ మద్దతు ఎవరికో తెలుసా?

By - Tupaki Desk
Update: 2021-11-10 11:33 GMT
తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 ముగింపు దశకు చాలా స్పీడ్ గా దూసుకు పోతుంది. ఇప్పటికే బిగ్ బాస్‌ 10 వారాలు పూర్తి అయ్యింది. మరి కొన్ని వారాల్లో సీజన్ ముగియబోతుంది. ఈ సమయంలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు సంబంధించిన వారు అంతా కూడా బయట పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయడం.. ప్రమోషన్స్‌ చేయడం చేస్తున్నారు. పబ్లిసిటీ తో తమ వారికి ఓట్లు వేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఖర్చు చేస్తుంటే మరి కొందరు తమ సర్కిల్ ను ఉపయోగించుకుని పబ్లిసిటీ చేయిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ అయితే ఉంటుంది. ఇన్ని వారాలు ఉన్నారంటే వారు బెస్ట్‌ అనడంలో సందేహం లేదు. ఈ సమయంలో ఉన్న వారు అంతా కూడా స్ట్రాంగ్ కనుక ఇకపై కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్‌ అవుతుంది. అందుకే బిగ్ బాస్‌ లో ఉన్న తమ వారి కోసం బయటి వారి హడావుడి ఎక్కువ అయ్యింది. అలా కొందరు స్టార్స్ తో కంటెస్టెంట్స్ గురించి మాట్లాడించడం వల్ల మైలేజ్ ను దక్కించుకోవాలని కొందరు ప్రయత్నిస్తే మరి కొందరు మరోరకంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సమయంలో శ్రీరామ్‌ చంద్రకు సోనూసూద్‌ నుండి మద్దతు దక్కడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇండియన్ ఐడల్ గా నిలిచిన శ్రీరామ్ చంద్ర బిగ్ బాస్ సీజన్‌ 5 విజేతగా నిలవాలని ఆయన ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్నారు. అందుకోసం తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. తాజాగా శ్రీరామ చంద్ర గురించి సోనూసూద్‌ మాట్లాడటం వారికి ఆనందం కలిగించింది. నేను బిగ్ బాస్ లో శ్రీరామ చంద్రను చూస్తున్నాను.. మీరు చూస్తున్నారా అంటూ అతడికి తన మద్దతును సోనూసూద్‌ తెలియజేశాడు. ఇప్పటికే శ్రీరామ చంద్ర టాప్‌ 5 వరకు ఉంటాడని అందరు చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో రియల్‌ హీరో అయిన సోనూసూద్‌ నుండి కూడా మద్దతు దక్కించుకోవడంతో ట్రోఫీ కూడా దక్కించుకుంటాడేమో అంటూ నెటిజన్స్ ఆశలు పెట్టుకుంటున్నారు.

సోనూ సూద్‌ కరోనా సమయంలో వలస కార్మికుల కోసం చేసిన ఛారిటీ ఏ ఒక్కరు మర్చిపోలేరు. దేశం మొత్తం కూడా ఆక్సీజన్ కొరతతో అల్లాడుతున్న సమయంలో వేల మంది ప్రాణాలు కాపాడటం కోసం విదేశాల నుండి ఆక్సీజన్ ను తెప్పించి అందించిన ఘనత ఆయనకు దక్కుతుంది. అంతే కాకుండా ఇంకా ఎంతో మంది విద్యకు సాయం చేస్తున్నాడు.. ఎంతో మంది ఆపదలో ఉంటే.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సాయంగా నిలుస్తున్నాడు. అలాంటి సోనూసూద్‌ ప్రతి ఒక్కరి గుండెలో ఉన్నారు. అలాంటి సోనూ సూద్‌ మద్దతును శ్రీరామ చంద్ర దక్కించుకోవడం ఆయన సగం విజయాన్ని సొంతం చేసుకున్నట్లే అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • BigBoos5telugu 
  • bigg boss 5 Sreerama Chandra 
  • Sonu Sood 
  • bigg boss manas 
  • hotstar 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS