• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ధ‌నుష్ తొలి తెలుగు...

ధ‌నుష్ తొలి తెలుగు సినిమాకు బిగ్ షాక్‌

By - Tupaki Desk
Update: 2022-01-25 14:38 GMT
కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ త‌న భార్య ఐశ్వ‌ర్య‌కు విడాకులు ప్ర‌క‌టించిన వార్త‌ల్లో నిలిచారు. ఈ విష‌యం కార‌ణంగా గ‌త కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారిన ధ‌నుష్ తాజాగా మ‌రో సారి వార్త‌ల్లో నిలిచారు. అయితే ఈ సారి త‌ను తెలుగులో తొలిసారి చేస్తున్న సినిమాతో కావ‌డం గ‌మ‌నార్హం. విభిన్న‌మైన చిత్రాల‌తో హీరోగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని సొంతం చేసుకున్న ధ‌నుష్ న‌టిస్తున్న చిత్రం `స‌ర్‌`. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో తెర‌కెక్క‌తున్న ఈ మూవీ ఆదిలోనే ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ వార్త‌ల్లో నిలుస్తోంది.

యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి తెర‌కెక్కిస్తున్న ఈ మూవీని సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యాన‌ర్ ల‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, త్రివిక్ర‌మ్ వైఫ్ సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో `సార్‌`, త‌మిళంలో `వాతి` పేరుతో రూపొందుతున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది.  ఈ మూవీ చిత్రీక‌ర‌ణ కోసం ఇటీవ‌లే హీరో ధ‌నుష్ హైద‌రాబాద్ కి వ‌చ్చేశారు.  

ఈ మూవీ టైమ్ బాగున్న‌ట్టుగా లేదు. తాజాగా ఈ చిత్రానికి బిగ్ షాక్ త‌గిలింది. ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్న సినిమాటోగ్రాఫ‌ర్ ఉన్న‌ట్టుండి ఈ మూవీ నుంచి తాను త‌ప్పుకుంటున్నాన‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రానికి దినేష్ కృష్ణ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్ గా వ్య‌వ‌హ‌రించాలి. ఈ మూవీ ప్ర‌క‌టించిన సంద‌ర్భంలోనే మేక‌ర్స్ మోష‌న్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసి అందులో టెక్నిషియ‌న్ ల‌ని కూడా ప‌రిచ‌యం చేశారు.

అయితే ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ ఈ చిత్రం నుంచి సినిమాటోగ్రాఫ‌ర్ దినేష్ కృష్ణ‌న్ తాను త‌ప్పుకుంటున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. అని వార్య కార‌ణాల వ‌ల్ల తాను ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని, అయితే త్వ‌ర‌లోనే  సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యాన‌ర్ ల‌లో సినిమా చేస్తాన‌ని దినేష్ కృష్ణ‌న్` వెల్ల‌డించ‌డంతో ఆయ‌న స్థానంలో సినిమాటోగ్రాఫ‌ర్ గా మ‌ళ్లీ ఎవ‌రిని టీమ్ లోకి తీసుకుంటారా? అని చ‌ర్చ జ‌రుగుతోంది.

పిరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో హీరో ధ‌నుష్ కాలేజీ లెక్చ‌ర‌ర్ గా క‌నిపించ‌బోతున్నారు. ఉన్న‌త‌మైన ల‌క్ష్యంతో ఓ సామాన్యుడు లెక్చ‌ర‌ర్ గా మారిన విధానాన్ని ఈ చిత్రంలో చూపించ‌బోతున్నారు. స‌రికొత్త నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి జీవీకె ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తుండ‌గా,  న‌వీన్ నూలి ఎడిట‌ర్ గా వ‌ర్క్ చేస్తున్నారు.
Tags:    
  • Actor Dhanush 
  • SIR 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

Copyright @2026

Powered by Blink CMS