• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బి ఇంట్లో అద్దెకు...

బిగ్ బి ఇంట్లో అద్దెకు కృతి సనన్‌.. రెంట్ తెలిస్తే షాకే!

By - Tupaki Desk
Update: 2021-12-10 04:40 GMT
బిగ్ బి అమితాబ్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటన విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. వ్యక్తిగత విషయాల మీద అందరికి అన్నో ఇన్నో విషయాలు తెలుసు. కానీ.. చాలామందికి తెలీని మరో కోణం అమితాబ్ లో ఉంది.

ఆయన తనకున్న ఆస్తిపాస్తులను అద్దెకు ఇస్తుంటారు. నెల తిరిగేసరికి అద్దెల రూపంలో వచ్చే ఆదాయం సైతం భారీగా ఉంటుందని చెబుతారు. తాజాగా అలాంటి డీల్ ఒకటి పూర్తి చేశారు అమితాబ్. తాజా డీల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఈసారి తనకు చెందిన ఒక ప్రాపర్టీని ప్రముఖ సినీనటి కృతి సనన్‌ కు అద్దెకు ఇవ్వటమే.

ముంబయి సౌత్ అంధేరిలో ఒక డుప్లెక్స్ ప్లాట్ ను ఇటీవల అమితాబ్ కొనుగోలు చేశారు. దీన్ని అద్దెకు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. ఆయన తన ప్లాట్ ను అద్దెకు ఇవ్వటం ఆలస్యం.. చాలామంది సెలబ్రిటీలు సదరు ఇంటిని అద్దెకు తీసుకోవాలని ప్రయత్నించారు. ఇందుకోసం అమితాబ్ ను సంప్రదించారు. కానీ.. ఆ అవకాశం మాత్రం ప్రముఖ సినీ నటి కృతి సనన్‌ కు దక్కింది. ఈ డూప్లెక్స్ ప్లాట్ కు అమితాబ్ వసూలు చేసే రెంట్ లెక్క తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

నెలకు రూ.10లక్షల చొప్పున అద్దెను డిసైడ్ చేశారు. ఇందుకు కృతి ఓకే చెప్పింది. సెక్యురిటీ డిపాజిట్ గా రూ.60 లక్షలు చెల్లించినట్లు చెబుతున్నారు. ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2021 అక్టోబరు 16 నుంచి 2023 అక్టోబరు 15 వరకు ఈ ఇంటిని కృతి సనన్‌ కు అద్దెకు ఇచ్చారు. ఈ ఇంటిని 2020 డిసెంబరులో రూ.31 కోట్ల మొత్తానికి కొనుగోలు చేశారు. 2021లో ఆయన హ్యాండోవర్ కు వచ్చింది.

ఈ ఇంటి మొత్తం విస్తీర్ణం 5184 చదరపు అడుగులు. అంధేరిలోని లోకండ్ వాలా రోడ్డులో ఉన్న ఈ బిల్డింగ్ లో అమితాబ్ ప్లాట్ 27, 28 అంతస్తుల్లో ఉంది. అమితాబ్ కు ముంబయిలో అనేక ప్రాపర్టీలు ఉన్నాయి. వాటిని ఆయన అద్దెకు ఇస్తుంటారు. జుహూలోని వత్స.. అమ్ము అనే బంగ్లాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అద్దెకు ఇచ్చారు. మొత్తంగా తాజాగా ముగిసిన డీల్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీనిపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Tags:    
  • Kriti Sanon 
  • Big B Amitabh 
  • Kriti Sanon pics 
  • Kriti Sanon new pics 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS