• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్రేకింగ్ : 'వి' మూవీని...

బ్రేకింగ్ : 'వి' మూవీని ఓటీటీలో చూడమని ప్రకటించిన నాని...!

By - Tupaki Desk
Update: 2020-08-19 17:34 GMT
నాని - సుధీర్ బాబు హీరోలుగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'వి' సినిమా ఓటీటీలో విడుద‌ల కాబోతుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. నాని కెరీర్‌ లో 25వ సినిమాగా వస్తున్న 'వి' లో అదితి రావ్ హైదరి - నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా.. సుధీర్ బాబు పోలీస్ గా కనిపిస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్న 'వి' సినిమాని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావలనుకున్నారు. మార్చి 25న ఉగాది కానుకగా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. అయితే కరోనా ప్రభావం థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోందని నాని పరోక్షంగా ట్వీట్ చేశాడు.

కాగా నాని 'వి' ఓటీటీ రిలీజ్ కి సంబంధించి రేపు కీల‌క ప్ర‌క‌టన చేయబోతోందని ప్రకటించాడు. దీనికి నాని హోమ్ థియేటర్ లో సినిమా చూస్తున్నట్లు ప్రమోట్ చేస్తూ ఓ వీడియో కూడా జతచేసాడు. ''సినిమా అయిపోతేనేమి.. మళ్ళీ చూస్తా.. మళ్ళీ మళ్ళీ చూస్తా.. నాకు ఇష్టమొచ్చినన్ని సార్లు చూస్తా.. థియేటర్ ఇంటికి వచ్చినా రాకపోయినా థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ మాత్రం ఇంటికి రాబోతోంది. మన ఇళ్లే థియేటర్ గా మారబోతోంది'' అంటూ నాని చెప్పుకొచ్చాడు. దీంతో ఇన్ని రోజులు ఈ సినిమాపై వస్తున్న వార్తలన్నీ నిజమే అని నాని కంఫర్మ్ చేసాడు. ఓటీటీలో విడుద‌ల కానున్న తొలి తెలుగు భారీ చిత్రం ఇదేనని చెప్పవచ్చు. అయితే ఈ వీడియో రిలీజ్ చేయడం ద్వారా నాని థియేటర్స్ కన్నా ఓటీటీలు గొప్ప అనే విధంగా ప్రమోట్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాని సెప్టెంబ‌ర్ 5న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుద‌ల చేయనున్నట్లు స‌మాచారం.

Tomorrow

Tags:    
  • Nani 
  • V movie 
  • OTT 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS