అలా అయితే వంద కోట్ల షేర్ గ్యారెంటీ
వేసవి తర్వాత తెలుగు భారీ చిత్రాలేవీ రాలేదు. ‘గీత గోవిందం’.. ‘ఆర్ ఎక్స్ 100’ లాంటి సినిమాలు చాలా బాగా ఆడాయి కానీ.. టాప్ లెవెల్ స్టార్స్ నటించిన సినిమాలు రాకపోవడం ప్రేక్షకులకు కొంతవరకు లోటే. టాప్ స్టార్స్ నటించిన సినిమాలు రిలీజైతే ఉండే సందడే వేరు. ఇటు అభిమానులతో పాటు అటు యువత.. కుటుంబ ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తారు. థియేటరుకి వెళ్లి తమ విలువైన డబ్బులు ఖర్చు చేయాలంటే ఒక స్థాయి సినిమా ఉండాలని ఆశించే ప్రేక్షకుల వర్గం ఒకటుంటుంది. అలాంటి వాళ్ల కోసం ఈ ఏడాది ద్వితీయార్ధంలో రాబోతున్న సినిమా ‘అరవింద సమేత’. సెకండాఫ్ లో కింగ్ ఈ సినిమానే అని చెప్పొచ్చు. దసరా కానుకగా అక్టోబరు 11న రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
సరిగ్గా దసరా సెలవులు మొదలయ్యే సమయంలోనే రాబోతుండటం దీనికి బాగా కలిసొచ్చే అంశం. దీనికి తోడు.. రిలీజ్ ముంగిట రోడ్ మొత్తం క్లియర్ అయిపోయింది. గత వారాంతంలో వచ్చిన ‘నోటా’ వీకెండ్ వరకు జోరు కొనసాగించడమే కష్టమైంది. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్ తర్వాత అస్సలు నిలిచే పరిస్థితి లేదు. ముందు వారం వచ్చిన ‘దేవదాస్’ కథ కూడా ముగింపు దశకు వచ్చేసింది. మిగతా సినిమాల గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం దాదాపుగా థియేటర్లు అంతటా వెలవెలబోతున్నాయి. సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్నాయి. ఇలాంటి టైంలో ‘అరవింద సమేత’ వస్తుండటంతో దీన్ని మెజారిటీ థియేటర్లతో నింపేయబోతున్నారు. 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో 90 శాతానికి పైగా థియేటర్లలో ‘అరవింద సమేత’నే కనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో టికెట్లు రేట్లు పెంచేస్తున్నారు. అదనపు షోలూ వేస్తున్నారు. తెలంగాణలో కూడా అదనపు షోలు.. టికెట్ల రేటు పెంపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడా పర్మిషన్లు వచ్చి.. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వసూళ్ల మోత మామూలుగా ఉండదు. ఈజీగా రూ.100 కోట్ల షేర్ మార్కును దాటేయడానికి అవకాశాలున్నాయి.