• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతి రేసు నుంచి...

సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయక్ తప్పుకున్నట్లే

By - Tupaki Desk
Update: 2021-11-05 04:32 GMT
తెలుగు వారికి పెద్ద పండుగ.. ఇప్పటికి మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగకు ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. తెలుగు వారికి ఎన్ని పండుగలు ఉన్నా.. సంక్రాంతి మాత్రం సో స్పెషల్. అందుకు.. ఆ ప్రత్యేకతకు తగ్గట్లే.. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సినిమాలు కూడా పెద్ద ఎత్తున విడుదల అవుతుంటాయి. సంక్రాంతి రేసులోకి వచ్చేందుకు అగ్రహీరోలంతా ఆరాటపడుతుంటారు. కనీసం రెండు నుంచి నాలుగు సినిమాల వరకు విడుదల అవుతుంటాయి. సంక్రాంతికి రెండు వారాల ముందు నుంచి సినిమాల జోరు షురూ అవుతుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వచ్చే సంక్రాంతికి గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలు పోటెత్తటం తెలిసిందే. పోటాపోటీగా రిలీజ్ డేట్లను ప్రకటించిన అగ్రహీరోల సినిమాలు.. నెమ్మదిగా సంక్రాంతి పోరు నుంచి తప్పుకోవటం గమనార్హం. ఇప్పటికే మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీని జనవరి 13న థియేటర్లకు తెస్తామని చెప్పినా.. దాని రిలీజ్ డేట్ మారి ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించటం తెలిసిందే.

మరోవైపు పవన్ కల్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ జనవరి 12వ తేదీన రిలీజ్ ప్రకటించారు. డార్లింగ్ ప్రభాస్ రాధేశ్యామ్ ను జనవరి 14న విడుదల చేయటానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాల విడుదలకు వారం ముందే అంటే.. జనవరి 7న దర్శక ధీరుడు రాజమౌళి నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు వీలుగా భారీగా ప్లాన్ చేయటం తెలిసిందే.

ఇంత భారీగా ప్లాన్ చేసిన వేళ.. ఆ మూవీతో తమ మూవీ క్లాష్ కాకూడదన్న ఆలోచనతో సర్కారు వారి పాట పక్కకు వెళ్లిపోతే.. తాజాగా పవన్ కల్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ కూడా అదే బాటను పట్టినట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా.. దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ లో సినిమా విడుదలను చెప్పే డేట్ లేకపోవటంతో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కోసమే పవన్ తన మూవీ రిలీజ్ ను వాయిదా వేసుకునేందుకు ఓకే చెప్పారని.. ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా.. పోస్టర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. ఆర్ఆర్ఆర్ కు అన్ని మంచి శకునాలేనని చెప్పక తప్పదు.
Tags:    
  • Bheemla Nayak 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS