• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఫీషియల్ : భరత్-సూర్య...

అఫీషియల్ : భరత్-సూర్య రాజీ పడ్డారు

By - Tupaki Desk
Update: 2018-02-22 12:25 GMT
ఏప్రిల్ 26నే వస్తామని ఒకరి మీద ఒకరు పోటీకి సై అన్న నా పేరు సూర్య, భరత్ అనే నేను నిర్మాతలు ఇందాకా జరిగిన సామరస్యపూర్వక సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. గత కొద్ది రోజులుగా ఈ డేట్స్ గురించి అభిమానుల్లో సైతం తీవ్ర ఆందోళన ఉంది. ఒకేరోజు క్లాష్ అవ్వడం వచ్చే ఇబ్బందుల గురించి వాళ్ళ మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్లు సైతం దీని గురించి వర్రీ అవుతుండటంతో ఇప్పుడు అధికారికంగా దీనికి చెక్ పడిపోయింది. సీనియర్ నిర్మాతలు డాక్టర్ కెఎల్ నారాయణ - దిల్ రాజు లతో పాటు నా పేరు సూర్య నిర్మాతలు బన్నీ వాసు - లగడపాటి శ్రీధర్ - సమర్పకుడు నాగబాబు తో కలిసి భరత్ అనే నేను నిర్మాత డివివి దానయ్య కూడా ఇందులో పాల్గొన్నారు. సాధ్యాసాధ్యాల గురించి చాలా సేపు చర్చించిన అనంతరం పక్కా  కంక్లూజన్ కు వచ్చేసారు.

దీని ప్రకారం నా పేరు సూర్య ఒక వారం ఆలస్యంగా అంటే మే 4న విడుదల అవుతుంది. ఇక భరత్ అనే నేను ప్రీ పోన్ చేస్తూ ఏప్రిల్  20న వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ లెక్కన రెండు సినిమాలకు రెండు వారాల మంచి గ్యాప్ దొరుకుతుంది. మధ్యలో వచ్చే రజనికాంత్ కాలా డేట్ లో మాత్రం ఏ మార్పు ఉండదు. ఇప్పుడు బన్నీ - ప్రిన్స్ ఫాన్స్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రమోషన్ పరంగా నా పేరు సూర్య అడ్వాన్సు గా ఉంది. ఈ పాటికే టీజర్ - రెండు ఆడియో ట్రాక్స్  విడుదల చేసేసారు. భరత్ అనే నేను ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఒక వాయిస్ ఓవర్ ఓత్ మాత్రం వచ్చింది. ఇప్పుడు డేట్ పక్కా అయ్యింది కాబట్టి భరత్ అనే నేను ప్రమోషన్ వేగం అందుకుంటుంది. ఈ మీటింగ్ జరగడానికి ముందే మహేష్ - బన్నీ సైతం ఒకరికొకరు ఫోన్ లో దీని గురించి చర్చించినట్టు తెలిసింది. వాళ్ళ చొరవ కూడా ఉండటం వల్లే ఈ మీటింగ్ కుదిరిందని టాక్.

ఇలా ఒక అండర్ స్టాండింగ్ తో కలిసి కూర్చుని మాట్లాడుకుని నిర్మాతలు నిర్ణయం తీసుకోవడం చాలా మంచి పరిణామం అని చెప్పాలి. ఊరికే పంతాలకు పోయి ఓపెనింగ్స్ తగ్గించుకోవడం కంటే ఇలా ఆరోగ్యకరమైన గ్యాప్ మైంటైన్ చేయటం చాలా హెల్ప్ అవుతుంది. అది గుర్తించి ఇలా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రత్యేక చొరవ తీసుకున్న నారాయణ - దిల్ రాజులు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.
Tags:    
  • Allu Arjun 
  • Naa Peru Surya 
  • Mahesh babu 
  • Bharat ane Nenu 
  • Telugu NEWs 

Similar News

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

Copyright @2026

Powered by Blink CMS