సుమన్ నా జీవితాన్ని కాపాడాడు.. బ్లూఫిల్మ్ వివాదం పై స్పందించిన భానుచందర్
సుమన్ ఒకప్పుడు తెలుగులో స్టార్హీరో. ఇప్పుడున్న అగ్రహీరోలతో సమానంగా సుమన్‌కు ఎక్కువ క్రేజ్ ఉండేది. కానీ కొంతమంది కుట్రవల్ల సుమన్ బ్లూఫిల్మ్ కేసులో ఇరుక్కున్నాడు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు సుమన్ కెరీర్ ను నాశనం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఓ పెద్దహీరో పేరు కూడా వినిపించింది. బ్లూఫిల్మ్ కేసులో జైలుకెళ్లాక సుమన్ కెరీర్ నాశనమైంది. ఆ తర్వాత అతడు చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యాడు. బ్లూఫిల్మ్ వివాదం పై సుమన్ ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ ఇచ్చాడు.
తనపై కుట్రచేసి జైలుకు పంపించిన మాట నిజమేకానీ.. ఆ కుట్రలో సినిమావాళ్లు ఎవరూ లేరని.. బయటి వాళ్లే ఉన్నారని సుమన్ చాలా సార్లు చెప్పాడు. అయితే తాజాగా ఓ టీవీచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ మరోసారి ఈ విషయంపై స్పందించారు. ఇటీవల ఓ టీవీ చానల్‌కు సుమన్ అతడి ప్రాణమిత్రుడు ప్రముఖ హీరో భానుచందర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వాళ్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సుమన్.. భానుచందర్ గురించి చాలా విషయాలు చెప్పాడు. తమిళంలో చిన్న చిన్న సినిమాలు చేసుకుంటున్న తనను భానుచందరే తెలుగు తెరకు పరిచయం చేశాడని చెప్పాడు సుమన్. అప్పట్లో సుమన్ ఫైట్లకు మాస్జనంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. మార్షల్ ఆర్ట్స్ చేసిన సుమన్ చేసే ఫైట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో చాలా కొద్దిరోజుల్లోనే సుమన్ తెలుగునాట ప్రముఖ హీరోగా ఎదిగాడు. అతడి కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బ్లూఫిల్మ్ కేసు తెరమీదకు వచ్చింది.
ఈ విషయంపై సుమన్ మాట్లాడుతూ.. ‘ నా స్నేహితుడైన దివాకర్ అనే వ్యక్తి నన్ను ఈ కేసులో ఇరికించాడు. ఈ కేసుతో ఇండస్ట్రీ కి ఏ విధమైన సంబంధం లేదు’ అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఈ కేసులో భాను చందర్ ను కూడా ఇరికించేందుకు కుట్ర చేశారు. కానీ నేను సమయ స్ఫూర్తితో వ్యవహరించి అతడి పేరు బయటకు రాకుండా చేశాను’ అని సుమన్ చెప్పాడు. ఈ విషయంపై భానుచందర్ మాట్లాడుతూ.. సుమన్ తన జీవితాన్ని నిలబెట్టాడని చెప్పారు. బాపు-రమణల్లాగా తమది కూడా గొప్ప స్నేహమని చెప్పారు. ఈ రోజుల్లో కేవలం అవసరాల కోసం స్నేహం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు.