'గీత వర్మ రాతను మార్చిందా ?

Update: 2018-12-09 07:18 GMT
ఇప్పటి కే లెక్కలేనన్ని సార్లు వాయిదా పడి ఉన్న కాసింత ఆసక్తి ని చేతులారా చంపేసిన వర్మ నిర్మాణంలోని కొత్త సినిమా భైరవగీత కన్నడ లో మాత్రం మొన్నే 7నే రిలీజ్ చేసారు. ఇక్కడ నాలుగు సినిమాలు పోటీ ఉండటంతో పాటు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వర్మ తెలుగు వెర్షన్ ను వదిలే సాహసం చేయలేదు. కానీ కన్నడలో పరిస్థితి సానుకూలంగా ఉండటంతో ఫైనల్ గా అక్కడి ప్రేక్షకులను భైరవ గీత పలకరించింది.

ఇక అక్కడి టాక్ రివ్యూలను గమనిస్తే మరీ దారుణంగా రాకపోవడం విశేషం. కొత్త దర్శకుడు సిద్దార్థ తాతోలు టేకింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. కాకపోతే మితి మీరిన వయోలెన్స్ తో పాటు వర్మ మార్కు యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో కూడా ఉండటం కొంత మైనస్ గా అభిప్రాయపడుతున్నారు. హీరో విలన్ పాత్ర లు అరుచుకోవడం ఛాలెంజులు చేసుకోవడం లాంటివి అక్కడి వాళ్ల కు బాగానే కనెక్ట్ అయ్యాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే కన్నడ ప్రేక్షకులు హింసను బాగా ఆదరిస్తారు. అక్కడి ట్రెండ్ ను గమనిస్తే గత కొన్నేళ్లలో వయొలెన్స్ సబ్జెక్ట్స్ బాగా ఆడాయి. అందుకే భైరవ గీత పూర్తి నెగటివ్ టాక్ తెచ్చుకోలేదని మరో విశ్లేషణ ఉంది.

కానీ ఇలాంటి బ్యాక్ డ్రాప్ మన తెలుగు ప్రేక్షకులకు కొట్టిన పిండే కాబట్టి అంత కొత్త గా అనిపించకపోవచ్చని అంటున్నారు. రేటింగులు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒకటి ఇవ్వగా కొన్ని పేరొందిన సైట్స్ 2.75 నుంచి 3 దాకా ఇచ్చాయి. అయితే కన్నడ ప్రేక్షకుల అభిరుచి లో మనకు తేడా ఉంటుంది కాబట్టి వీటిని బట్టి చెప్పలేం కానీ ఈ నెల 14న విడుదల కానున్న తెలుగు వెర్షన్ ఇక్కడ  ఎలా  రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది
Tags:    

Similar News