• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'సీత'ను ఎట్టకేలకు...

'సీత'ను ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించారు

By - Tupaki Desk
Update: 2019-01-25 12:43 GMT
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సక్సెస్‌, ఫ్లాప్‌ లను పట్టించుకోకుండా వరుసగా చిత్రాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే 'కవచం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పర్చిన బెల్లంకొండ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్రంలో కూడా హీరోయిన్‌ గా కాజల్‌ నటిస్తోంది. 'కవచం'లో వీరిద్దరి జోడీకి మంచి మార్కులు పడ్డ నేపథ్యంలో తేజ కూడా వీరిద్దరి కాంబోనే కంటిన్యూ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం టైటిల్‌ ను 'సీత' అంటూ చాలా రోజులుగా ప్రేక్షకుల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే అధికారికంగా మాత్రం అనౌన్స్‌ చేయలేదు.

కొన్ని వారాల క్రితం కాజల్‌ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతం తాను బెల్లంకొండ శ్రీనివాస్‌ తో కలిసి 'సీత' చిత్రంలో నటిస్తున్నట్లుగా చెప్పేసింది. అప్పటి వరకు వర్కింగ్‌ టైటిల్‌ మాత్రమే అని, తేజ మరో టైటిల్‌ గురించి ఆలోచిస్తున్నాడని అంతా భావించారు. కాని కాజల్‌ నోరు జారడంతో 'సీత' టైటిల్‌ పై క్లారిటీ వచ్చినట్లయ్యింది. కాజల్‌ నోరు జారిన తర్వాత కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు టైటిల్‌ పై క్లారిటీ ఇవ్వలేదు. ఎట్టకేలకు టైటిల్‌ పై క్లారిటీ వచ్చేసింది.

రేపు రిపబ్లిక్‌ డే సందర్బంగా సినిమా ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా నేడు టైటిల్‌ ను అనౌన్స్‌ చేసి ప్రకటించారు. సీత టైటిల్‌ లోగోను రివీల్‌ చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాపై ఆసక్తిని కలిగించారు. టైటిల్‌ ను బట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర కీలకంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అందుకే స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ ను ఈ చిత్రంకు తీసుకుని ఉంటారు.

తేజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. సమ్మర్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి ఉంద. ఎందుకంటే తేజ గత చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

Tags:    
  • Bellamkonda Srinivas 
  • Kajal Agarwal 
  • Seetha Movie First Look 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS