• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పక్కా కమర్షియల్' నుంచి...

'పక్కా కమర్షియల్' నుంచి అందమైన 'అందాల రాశి' గీతం..!

By - Tupaki Desk
Update: 2022-06-01 11:30 GMT
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''పక్కా కమర్షియల్''. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ కోర్టు డ్రామాలో అందాల భామ రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో గోపీచంద్ లాయర్ గా కనిపించనున్నారు. రిలీజ్ కు రెడీ అవుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న 'పక్కా కమర్షియల్' సినిమా నుంచి ఇప్పటి వరకూ రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభించింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా 'అందాల రాశి' అనే సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. 'అందాల రాశీ మేకప్ వేసి.. నాకోసం వచ్చేనే.. స్వర్గంలో కేసే నామీద వేసి భూమ్మీద మూసావే..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది.

సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా కోర్టు థీమ్ తో భారీ సెట్ లో విజువల్ గ్రాండియర్ గా 'అందాల రాశీ' పాటను షూట్ చేశారు. ఇందులో రాశీఖన్నా ఎంతో గ్లామరస్ గా కనిపించగా.. గోపీచంద్ హ్యాండ్సమ్ లుక్ తో అదరగొట్టాడు. ప్రధాన జంట కాస్ట్యూమ్స్ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి.

జానీ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు. ఇందులో గోపీచంద్ - రాశీ వేసిన సింపుల్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆర్ రవీందర్ దీనికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. సినిమాటోగ్రాఫర్ కరమ్ చావ్లా అద్భుతమైన విజువల్స్ అందించారు. ఎస్బీ ఉద్ధవ్ ఎడిటింగ్ నిర్వహించారు.
 
'అందాల రాశి' గీతానికి జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చారు. లిరిసిస్ట్ కె.కె అర్థవంతమైన సాహిత్యం అందించగా.. సాయి చరణ్ భాస్కరుని - రమ్య బెహర కలిసి ఆలపించారు. జీఏ2 పిక్చర్స్ & యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. SKN సహ నిర్మాత.

'పక్కా కమర్షియల్' చిత్రాన్ని టైటిల్ కు తగ్గట్టుగానే పక్కా కమర్షియల్ హంగులతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2022 జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.
Full View

Tags:    
  • GopiChandh 
  • RashiKhanna 
  • PakkaCommerical 
  • Song 
  • AndalaRashi 
  • RRavinder 
  • RamyBeher 
  • SaicharanBhaskarn 
  • GV2Pictures 
  • SKN 
  • Latestnews 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS