బిబి5 రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు

Update: 2021-04-04 06:35 GMT
తెలుగు బిగ్ బాస్‌ సీజన్‌ 4 కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభం అయినా కూడా మంచి రేటింగ్ ను దక్కించుకుందని స్టార్‌ మా వర్గాల వారు చెబుతున్నారు. ఇక ఇప్పటికే సీజన్ 5 కి సంబంధించిన సన్నాహాలు మొదలు అయ్యాయి అనే విషయం తెల్సిందే. కంటెస్టెంట్స్ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఇక సీజన్ 5 ను గత సీజన్ మాదిరిగా మరీ ఆలస్యం చేయకుండా జూన్‌ లేదా జులైలోనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఛానెల్‌ వారు చెబుతున్నారు. ఇక మరో ముఖ్యమైన విషయం హోస్ట్‌. ఈ విషయంలో ఉన్న అనుమానాలకు దాదాపుగా తెర పడ్డట్లుగానే అనిపిస్తుంది.

మీడియా వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం నాగార్జుననే మూడవ సారి హోస్ట్‌ గా కొనసాగబోతున్నాడు అంటున్నారు. కంటెస్టెంట్స్ విషయంలో ఈసారి మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారట. జెమిని టీవీలో త్వరలో ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో రాబోతుంది. ఆ షో మొదటి సీజన్‌ పూర్తి అయిన తర్వాత బిగ్‌ బాస్ సీజన్‌ 5 ప్రారంభం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. వచ్చే నెలలో ఎవరు మీలో కోటీశ్వరులు షురూ అయ్యే అవకాశం ఉంది. దాన్ని బట్టి బిబి 5 ప్రారంభం గురించి స్టార్‌ మా వారు నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. మొత్తానికి తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్ 5 చాలా స్పెషల్ గా తీర్చి దిద్దాలని భావిస్తున్నారు.
Tags:    

Similar News