• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిబి4 : అబ్బో ఇంట్లో...

బిబి4 : అబ్బో ఇంట్లో గడుసైన దొంగలే ఉన్నారే

By - Tupaki Desk
Update: 2020-10-01 10:30 GMT
బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి వెళ్లిన తర్వాత ఎంత మంచిగా ఉండాలనుకున్నా ఇచ్చే టాస్క్‌ లు మరియు పెట్టే పరీక్షలతో నిజ స్వరూపాలు బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఇన్ని రోజులు బయట ఉన్న వారు లోనికి వెళ్లిన తర్వాత కొన్నాళ్ల పాటు నటించేందుకు ప్రయత్నించినా ఏదో ఒక సమయంలో మాత్రం బయట పడక తప్పదు. బిగ్‌ బాస్‌ కాన్సెప్టే అది అనడంలో సందేహం లేదు. అలాంటి బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 4 కంటెస్టెంట్‌ ఒరిజినల్‌ రూపాలను బయటకు తీసుకు వస్తున్నాడు. ప్రస్తుత వారంలో కాయిన్‌ గేమ్‌ ను నిర్వహించారు. అందులో భాగంగా ఎవరి వద్ద ఎక్కువ కాయిన్స్‌ ఉంటే వారే కెప్టెన్‌ పోటీ దారులకు అర్హులు. ఈ ఆటలో ఎవరు ఏంటీ అనేది పూర్తిగా క్లారిటీ వచ్చేసింది.

ఒకరి నుండి ఒకరు కాయిన్స్‌ ను పట్టుకోవడంతో పాటు కొట్టేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అర్థ రాత్రి సమయంలో మెహబూబ్‌ మరియు సోహెల్‌ లు కాయిన్స్‌ ను ఇతరుల నుండి కొట్టేసేందుకు చేసిన ప్రయత్నాలు నవ్వు తెప్పించాయి. అదే సమయంలో వారి కన్నింగ్‌ గుణం బయటకు వచ్చింది. ఒక వైపు సోహెల్‌ మరియు మెహబూబ్‌ లు ఇతరుల కాయిన్స్‌ కొట్టేసే ప్రయత్నం చేస్తుంటే వారి కాయిన్స్‌ ను హారిక కొట్టేసేందుకు ప్రయత్నించడం హైలైట్‌.

మొత్తానికి బిగ్‌ బాస్‌ హౌస్‌ లో ఉన్న చిలిపి దొంగలు గడుసు దొంగలు ఎవరు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 గత వారం ఉక్కు హృదయం టాస్క్‌ ఆకట్టుకుంది. అలాగే ఈ సారి కూడా కాయిన్స్‌ గేమ్‌ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.

నిన్నటి ఎపిసోడ్‌ లో అమ్మ రాజశేఖర్‌ ఎంతో కష్టపడి దాచేసిన కాయిన్స్‌ ను సోహెల్‌ కొట్టేయడం జరిగింది. దాంతో అమ్మ రాజశేఖర్‌ కు చాలా కోపం వచ్చింది. బెడ్‌ కింద పెట్టి వాటికి అడ్డుగా పడుకున్నా కూడా వాటిని కొట్టేశారు అంటూ అమ్మ రాజశేఖర్‌ తీవ్ర ఆక్రోశంతో అరిచాడు. అందుకు సోహెల్‌ కూడా తక్కువ ఏం కాకుండా అరిచాడు. ఈ టాస్క్‌ తర్వాత లెవల్‌ కు వెళ్లింది. ఈ టాస్క్‌ లో సుజాత వద్ద ఉన్న స్విచ్‌ కాయిన్‌ కీలక పాత్ర పోషించబోతుంది. దాంతో ఆమె విన్నర్‌ గా నిలిచే అవకాశం ఉందని అనిపిస్తుంది. నేటి ఎపిసోడ్‌ లో ఏం జరుగుతుందో అనే ఆసక్తి అందరిలో ఉంది. నిన్నటి ఎపిసోడ్‌ లో అవినాష్‌ కాలికి గాయం అవ్వడం.. మోనాల్‌ బాత్‌ రూంలోకి వెళ్లి మమ్మీ అంటూ ఏడ్వడం కూడా ఆసక్తికర సంఘటనలు.
Tags:    
  • Bigg boss 
  • Bigg boss Season 4 
  • Tollywood 
  • Star Maa Bigg Boss 
  • Nagarjuna 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS