బిబి4 : ఎలిమినేషన్ సీన్ రివర్స్
శనివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ ది ఫేక్ ఎలిమినేషన్ అయ్యి ఉంటుందని అంతా చాలా బలంగా నమ్మారు. కాని మొదటి వారమే ఆమెకు ప్రేక్షకుల నుండి తక్కువ ఓట్లు వచ్చాయంటూ బిగ్ బాస్ టీం ఆమెను ఎలిమినేట్ చేశారు. ఆమెను సీక్రెట్ రూంలో ఉంచడం లేదా ఇంకేదో టాస్క్ ఇవ్వడం వంటివి ఏం చేయలేదు. ఆమెను నేరుగా ఎలిమినేట్ చేసేయడం జరిగింది. ఎలిమినేషన్ పక్రియ చాలా రసవత్తరంగా సాగుతుందని భావించిన ప్రేక్షకులకు నిరాశ కలిగించారు. నిన్నటి ఎపిసోడ్ లో మరొకరిని ఎలిమినేట్ చేస్తారని కూడా భావించారు. కాని అది కూడా జరగలేదు. గత వారం నామినేషన్స్ లో కేవలం స్వాతి మాత్రమే ఎలిమినేట్ అయ్యింది.
స్టేజ్ పై నుండి స్వాతిని మాట్లాడించడంతో నిన్నటి ఎపిసోడ్ ప్రారంభం అయ్యింది. ఒకొక్కరికి ఒక్కో ట్యాగ్ ను స్వాతి ఇచ్చి అక్కడ నుండి బయటకు వచ్చేసింది. నాగార్జున ఆ తర్వాత ఇంటి సభ్యులతో సీన్ రివర్స్ గేమ్ ఆడించాడు. అందులో భాగంగా మగవారు అంతా కూడా అమ్మాయిల మాదిరిగా రెడీ అవ్వగా అబ్బాయిలు మాదిరిగా అమ్మాయిలు రెడీ అయ్యారు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఇద్దరు చొప్పున డాన్స్ లేదా కామెడీ స్కిట్ చేశారు. ఈ సందర్బంగా అందరు కూడా నవ్వించారు. ముఖ్యంగా అమ్మ రాజశేఖర్.. సుజాత చేసిన చిరంజీవి సౌందర్యల స్కిట్ అందరిని ఆకట్టుకుంది. ఇక మిగిలిన వారు అంతా కూడా చాలా బాగా చేశారు. అవినాష్ హారికలు ఖుషి నడుము సీన్ చేసి నవ్వించారు. గంగవ్వ కుమార్ సాయిలు ముత్యాలు వస్తావా అంటూ సాంగ్ కు డాన్స్ చేసి మరీ ఎంటర్ టైన్ చేశారు.
సీన్ రివర్స్ తర్వాత ఎలిమినేషన్ లో ఉన్న మిగిలిన వారిలో ఎవరు బయటకు వెళ్లబోతున్నారు అనే విషయాన్ని ప్రకటిస్తానంటూ నెం.1 నుండి నెం.6 వరకు ఎవరు నిల్చుంటారో తెల్చుకోండి అంటూ నాగార్జున చెప్పడంతో నెం.1 గా అభిజిత్.. నెం.2 లో మెహబూబ్.. నెం.3 లో లాస్య.. నెంబర్ 4 లో సోహెల్.. నెం. 5 లో కుమార్ సాయి మరియు చివరగా 6వ స్థానంలో హారిక నిల్చుంది. వీరిలో నుండి ఎవరు కూడా ఎలిమినేట్ అవ్వడం లేదని అందరిని ప్రేక్షకులు సేవ్ చేశారంటూ నాగార్జున ప్రకటించారు. అలాగే మీరు నిల్చున్న నెంబరింగ్ కూడా తప్పే అని మీకు బయట మరో రకంగా ఓట్లు వస్తున్నాయని నాగ్ ప్రకటించారు. నేటి నుండి 5వ వారంలోకి బిగ్ బాస్ అడుగు పెట్టింది. ఈ వారంకు నేడు ఎలిమినేషన్ నామినేషన్ జరుగబోతుంది.