• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అదిరిపోయిన 'బంగార్రాజు'...

అదిరిపోయిన 'బంగార్రాజు' టీజర్.. సంక్రాంతి బరిలోకి సోగ్గాళ్ళు..!

By - Tupaki Desk
Update: 2022-01-01 09:30 GMT
అక్కినేని తండ్రీకొడుకులు కింగ్ నాగార్జున - యువసామ్రాట్ నాగచైతన్య ప్రధాన పాత్రలలో నటిస్తోన్న తాజా చిత్రం ''బంగార్రాజు''. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ.. చైతూకు జోడిగా కృతి శెట్టి నటిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది బ్లాక్ బస్టర్ 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'బంగార్రాజు' సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సెటిమెంట్ ని నమ్ముకొని ఈసారి కూడా పెద్ద పండక్కి బరిలో దిగుతున్నారు. ఈ మేరకు మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. ఫస్ట్ లుక్ మరియు 'లడ్డుండా' 'నా కోసం' 'వాసివాడి తస్సాదియ్యా' పాటలతో సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చారు.

ఈ క్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా తాజాగా ''బంగార్రాజు'' టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో బంగార్రాజుగా నాగార్జున సందడి చేయగా.. ఇప్పుడు ఆయనకు తోడు చిన బంగార్రాజు నాగచైతన్యతో కలిసి అలరించడానికి వస్తున్నారు. లయకారుడి సన్నిధిలో అపశృతి జరిగిందని యమధర్మరాజు చెబుతుండగా.. బంగార్రాజు మళ్ళీ భూలోకానికి తిరిగి వచ్చినట్లు చూపించారు.

అయితే ఈసారి తన మనమడు చిన బంగార్రాజు సమస్య పరిష్కారానికి బంగార్రాజు భూమ్మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. 'ఇలా అందంగా ఉంటే దిష్టి తగిలి కాళ్ళు బెణుకుతాయి.. నేను దిష్టి తీయనా?' అంటూ చైతూ అమ్మాయిలను ఫ్లర్ట్ చేయడం చూస్తుంటే.. బంగార్రాజు బుద్ధులతో ఊడిపడినట్లు తెలుస్తుంది. అలాంటి సోగ్గాడు సర్పంచ్ కావాలని ఆశపడే నాగలక్షిని ప్రేమలోకి దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఫ్యామిలీలో ఏదో సమస్య తలెత్తగా.. దాని పరిష్కారం కోసం బంగార్రాజు దిగినట్లు టీజర్ లో చూపించారు. ఇందులో 'ఊరుకోవే పుటికి.. కితకితలెడుతున్నాయే..' అని రమ్యకృష్ణను నాగార్జున ఆటపట్టించడం నవ్వు తెప్పిస్తోంది. ఇందులో యాక్షన్ పాళ్ళు కూడా కాస్త ఎక్కుకే అని 'బంగార్రాజు' టీజర్ ని బట్టి అర్థం అవుతోంది.

నాగ్ - చైతూ కలసి యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారు. నాగార్జున పంచెకట్టులో.. నాగచైతన్య కలర్ ఫుల్ డ్రెస్సుల్లో స్టైలీష్ లుక్ లో కనిపిస్తున్నారు. టీజర్ చివర్లో అక్కినేని హీరోలిద్దరూ కలసి నడుచుకుంటూ వచ్చే సీన్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రాఫర్ యువరాజ్ విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా.. విజయ్ వర్ధన్ ఎడిటర్ గా వర్క్ చేశారు.

సోషల్ ఫాంటసీ అంశాలతో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ''బంగార్రాజు'' సినిమా రూపొందింది. ఇప్పుడు తాజాగా వచ్చిన టీజర్ మూవీపై అంచనాలు పెంచేసింది. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్ పై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కావాల్సిన పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ''బంగార్రాజు'' సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నాగార్జున విడుదల తేదీని ప్రకటించాలని చూస్తున్నారని సమాచారం.


Full View
Tags:    
  • Nagarjuna 
  • chaithanya 
  • Bangarraju 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS