బండ్ల గణేష్ బ్యాక్ విత్ రవితేజ

Update: 2017-10-15 15:30 GMT
కమెడియన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బండ్ల గణేష్ తర్వాత కాలంలో ప్రొడ్యూసర్ గా అవతారమెత్తాడు. పరమేశ్వరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొద్దికాలంలోనే పెద్ద హీరోలతో  సినిమాలు తీశాడు. ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ తో ఒకేసారి సినిమాలు చేసి స్టార్ ప్రొడ్యూసర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. చివరగా ఎన్టీఆర్ తో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో టెంపర్ నిర్మించాడు. ఆ తర్వాత  హీరోలెవరూ అతడికి అవకాశాలివ్వలేదు.

చేస్తే పెద్ద హీరోతోనే సినిమా చేయాలన్న పట్టుతో రెండేళ్లగా బండ్ల గణేష్ సినిమా ఏదీ స్టార్ట్ చేయలేదు. చివరకు మాస్ మహారాజా రవితేజ పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. ‘‘బండ్ల గణేష్ ఇన్నాళ్లూ తనకున్న పౌల్ట్రీ బిజినెస్ పై దృష్టి పెట్టాడు. ఇండస్ట్రీలోకి తిరిగి రావడానికి సరైన అవకాశం కోసం చూస్తున్నాడు. రవితేజతో సినిమా ప్రొడ్యూస్ చేయడం ద్వారా రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు’’ అని తనకున్న సన్నిహితుడొకరు తెలిపారు. ఈ సినిమాకు డైరెక్టర్ ను కూడా ఫైనల్ చేశాడని... త్వరలో సినిమా లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా చేసి వివరాలు రివీల్ చేయాలని అనుకుంటున్నాడట.

రవితేజ డెయిరీ ప్రస్తుతం ఖాళీ లేదు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటించిన రాజా ది గ్రేట్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో టచ్ చేసి చూడు చేస్తున్నాడు. దీని తర్వాత తమిళ్ సూపర్ హిట్ ఫిలిం బోగన్ రీమేక్ లో చేయబోతున్నాడు. బండ్ల గణేష్ సినిమా స్టార్ట్ చేయడానికి ముందు ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ కావాల్సి ఉంది.
Tags:    

Similar News