బండ్ల గణేష్ పాతిక కోట్లు పెట్టాడా?
టాలీవుడ్లో సెన్సేషనల్ కాంబినేషన్లు సెట్ చేసిన నిర్మాత బండ్ల గణేష్. ఐతే ‘టెంపర్’ తర్వాత హఠాత్తుగా కనిపించకుండా పోయాడీ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్. ఐతే ఈ మధ్య ఉన్నట్లుండి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘టూ కంట్రీస్’ రీమేక్ రైట్స్ కొని మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తూనే.. మరోవైపు రాఘవ లారెన్స్ ‘కాంఛన’ సిరీస్ లో భాగంగా తీయబోతున్న కొత్త సినిమా ‘నాగభైరవ’ తెలుగు హక్కుల్ని సొంతం చేసుకుని అందరికీ షాకిచ్చాడు. బండ్లకు ఒక్కసారిగా ఇలా పరాయి భాషల సినిమాల మీద ఇంత మోజు పుట్టడమేంటో అర్థం కావడం లేదు.
ఐతే ‘నాగభైరవ’ తెలుగు హక్కుల కోసం బండ్ల పెట్టిన రేటు ఎంతో తెలిస్తే మాత్రం దిమ్మదిరగడం ఖాయం. ఏకంగా రూ.25 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడట బండ్ల. రజినీకాంత్ సినిమాల్ని మినహాయిస్తే ఓ డబ్బింగ్ మూవీకి ఈ స్థాయిలో రేటు పెట్టడం ఇదే తొలిసారి. ఐతే రిలీజ్ రైట్స్ తో పాటు శాటిలైట్ కు కూడా కలిపి బండ్ల ఈ రేటు పెట్టాడట. కాంఛన సిరీస్ లో వచ్చిన సినిమాల ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే ఇది మరీ ఎక్కువ ధరేమీ కాదని చెప్పొచ్చు. ‘గంగ’ సినిమా తెలుగులో లేటుగా రిలీజైనప్పటికీ రూ.20 కోట్ల దాకా వసూలు చేసింది. ఆ సినిమా వసూళ్లను బట్టే లారెన్స్ ఈ రేటు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే సినిమా హిట్టయితే బండ్ల పెట్టుబడికి ఢోకా ఏమీ ఉండదు. కానీ తేడా వస్తే మాత్రం దెబ్బ మామూలుగా ఉండదు.