బాలయ్యతో మూవీ.. ఈ దర్శకుడు ఏం చేస్తాడో?
టాలీవుడ్ లో మాస్ యాక్షన్ కమర్షియల్ కథలు అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు బాలకృష్ణ. బాలకృష్ణ సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగ్స్, పవర్ ఫుల్ యాక్షన్ ఎలివేషన్స్. గూస్ బాంబ్స్ లాంటి ఫైటింగ్స్ ని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆశిస్తూ ఉంటారు. బాలకృష్ణ సినిమా వస్తుంది అంటే కచ్చితంగా ఈ అంశాలు అన్ని పుష్కలంగా ఉండేలా దర్శకులు కూడా చూసుకుంటారు. అయితే బాలకృష్ణ నుంచి ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచే ఎలివేషన్స్ అంటే ఈ మధ్యకాలంలో బోయపాటి శ్రీను పేరు మాత్రమే వినిపిస్తుంది. సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో బాలయ్యని ఫ్యాన్స్ ఎలా చూడాలని కోరుకుంటారో అలా అన్ని అంశాలని కరెక్ట్ గా పేర్చి బోయపాటి వండి వార్చుతాడు.
పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అయితే బోయపాటి సినిమాలు బాలకృష్ణ అవుట్ ఆఫ్ ది లా అన్నట్లు ఏం చేసిన కూడా నమ్మే విధంగా ఉంటాయి. అయితే ఇతర దర్శకులు మాత్రం బాలకృష్ణతో సినిమా చేసే సమయంలో బోయపాటి స్థాయిలో పవర్ ని ప్రెజెంట్ చేయలేరు. యాక్షన్ ఎలిమెంట్స్, డైలాగ్స్ ని పవర్ ఫుల్ గా డిజైన్ చేసుకున్నా కథని పెర్ఫెక్ట్ గా సిద్ధం చేసుకున్న ఎక్కడో ఒక చోట ఈ స్టొరీ బాలకృష్ణకి సెట్ కాలేదు అనే ఫీలింగ్ కలుగుతుంది.
అఖండ లాంటి భీభత్సమైన బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి ఆ హైప్ ని అందుకోలేకపోయింది. కథనంలో ఉన్న లోపాలతో పాటు బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్లుగా విలన్ ఎలివేషన్స్ లేకపోవడం కూడా దీనికి ఒక కారణంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108 సినిమా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి అంటే యాక్షన్ తో పాటు కామెడీ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉంటుంది.
ఈ నేపధ్యంలో బాలకృష్ణ కోసం కూడా ఈ సారి అనిల్ రావిపూడి బాలయ్య స్టైల్ సీరియస్ యాక్షన్ తో సినిమా చేస్తాడా లేదంటే తన స్టైల్ లో యాక్షన్ తో పాటు బాలయ్యతో నవ్వులు పూయించి ఎలిమెంట్స్ కూడా డిజైన్ చేసుకొని కథని ఆవిష్కరిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అనిల్ రావిపూడి సినిమా బాలయ్య ఇమేజ్ ని అందుకోలేకపోతే మళ్ళీ అఖండ ఫీట్ ని రిపీట్ చేయడానికి బోయపాటినే రావాలని అభిమానులు కచ్చితంగా కోరుకుంటారని చెప్పొచ్చు.