• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య 'గోన గ‌న్నారెడ్డి'...

బాలయ్య 'గోన గ‌న్నారెడ్డి' బాధ్యత ఆ దర్శకులకి అప్పగిస్తున్నారా..?

By - Tupaki Desk
Update: 2020-10-29 09:30 GMT
టాలీవుడ్ సీనియర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌ పౌరాణిక చారిత్రక సాంఘిక జానపద చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుంటారనే విషయం తెలిసిందే. 'భైరవద్వీపం' 'ఆదిత్య 369' 'పాండురంగడు' 'శ్రీరామరాజ్యం' 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ క్రమంలో కాకతీయుల చరిత్రలో వీరుడిగా పేరుగాంచిన 'గోన గన్నారెడ్డి' పాత్రలో బాలయ్య నటించనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బాల‌కృష్ణ‌ తన హోమ్ బ్యానర్ లో మరో నిర్మాత సి.క‌ళ్యాణ్ తో కలిసి నిర్మిస్తారని సమాచారం. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారనే దానిపై ఫిలిం సర్కిల్స్ లో అనేకమంది పేర్లు వినిపిస్తున్నాయి. బాల‌కృష్ణ‌ కెరీర్లో నిలిచిపోయే రెండు చిత్రాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను 'గోన గన్నారెడ్డి' కి దర్శకత్వం వహించనున్నారట. అంతేకాకుండా డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో ఈ సినిమాకు డైలాగ్స్ రాయించాల‌ని బాలయ్య అనుకుంటున్నాడట.

బాలయ్య - బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వస‌రం లేదు. వీరిద్ద‌రి కలయికలో వచ్చిన 'సింహా' 'లెజెండ్' చిత్రాలు బాక్సాపీస్ వ‌ద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం వీరిద్ద‌రూ కలిసి BB3 హ్యాట్రిక్ సినిమాతో మరోసారి ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధమ‌వుతున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే బోయ‌పాటి తనదైన యాక్షన్‌ పంథాలో ఈ మూవీని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అందులోనూ ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో కూడా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'గోన గన్నారెడ్డి' ని కూడా బోయపాటి చేతిలో పెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా బాలయ్యతో 'పైసా వసూల్' సినిమా తీసిన పూరీతో డైలాగ్స్ రాయించాలని అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేవ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.




Tags:    
  • Balakrishna 
  • latest News 
  • Movie News 

Similar News

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

Copyright @2026

Powered by Blink CMS