మరోసారి అదే లుక్ లో బాలయ్య?

Update: 2022-07-11 02:30 GMT
వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల F 3 సినిమాతో కాస్త పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు అనే చెప్పాలి. ఈ సినిమా నిర్మాతకు లాభాలను అందించింది కానీ పూర్తిస్థాయిలో డిస్ట్రిబ్యూటర్స్ ను మాత్రం కాపాడలేకపోయింది. చాలా ఏరియాల్లో నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని అనిల్ రావిపూడి మీద నమ్మకంతో దిల్ రాజు ఈ సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. కానీ అనిల్ రావిపూడి రొటీన్ ఫార్ములా ఈసారి పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

ఇక తదుపరి సినిమా విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా దర్శకుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నందమూరి బాలకృష్ణ తో అనిల్ రావిపూడి సినిమా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే. గతంలోనే వీరి కలయిక పై ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. ఇక బాలకృష్ణను 45 ఏళ్ల పైబడిన ఒక పవర్ఫుల్ వ్యక్తిగా ఆ సినిమాలో చూపించబోతున్నట్లు అనిల్ వివరణ ఇచ్చాడు.

అయితే ఈ సినిమాలో బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లో కనిపిస్తాడు అని తెలుస్తోంది. ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు వారి వయసు రీత్యా అలాంటి పాత్రలు కూడా చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. బాలయ్య గోపిచంద్ మలినేని సినిమాలో కూడా అలాంటి లుక్ లోనే కనిపిస్తున్నాడు. కానీ అనిల్ రావిపూడి మాత్రం అంతకంటే కాస్త డిఫరెంట్ గా హైలెట్ చేస్తాడని టాక్.

అనిల్ రావిపూడి కథ నచ్చడంతో బాలయ్య ఆ క్యారెక్టర్ కు మరింత స్టైలిష్ గా తెరపైకి తీసుకురావడానికి తన స్టైలిష్ తో చర్చలు మొదలు పెట్టాడట. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల బాలయ్యబాబు కూతురిగా కనిపించబోతున్నట్లు ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చేశారు. అయితే హీరో రాజశేఖర్ కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారు అని ఆ మధ్యలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. కానీ ఇంకా ఆ విషయంపై దర్శకుడు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.
Tags:    

Similar News