ఆ రోజుల్లోనే నాన్నగారు అడ్వాన్స్‌డ్‌

Update: 2015-05-23 11:30 GMT
నటసింహా బాలకృష్ణ నటించిన లయన్‌ ఇటీవలే రిలీజై బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌ వద్ద నెగెటివ్‌ ఫలితాన్ని అందుకున్నా, ఏపీ, తెలంగణలో మాస్‌ కొంతవరకూ లయన్‌ని ఆదుకున్నారు. ఫలితం ఇటీవలే ఓ సక్సెస్‌మీట్‌ జరుపుకోగలిగారు. ఈ సక్సెస్‌ వేడుకలో బాలయ్యబాబు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర సంగతులే చెప్పారు.

ఆరోజుల్లో నాన్న(ఎన్టీఆర్‌) గారు తోడు దొంగలు, పిచ్చి పుల్లయ్య లాంటి సినిమాల్లో నటించారు. అవన్నీ బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాపయ్యాయి. దానికి కారణం కథలు అడ్వాన్స్‌డ్‌గా ఉండడమే.. అని అన్నారు. అంతేనా నాలుగేళ్ల క్రితమే లయన్‌ కథ చెప్పాడు సత్యదేవ. అప్పుడే ఈ సినిమా తీసి ఉంటే కథ వేరేగా ఉండేది.. అప్పుడు తీస్తే అడ్వాన్స్‌డ్‌ అయ్యేదేమో? ఇప్పుడు తీశారు గనుకే హిట్టయ్యింది అన్నట్టే మాట్లాడారు.

చివరి శ్వాస వరకూ నాన్నగారి లాగే అన్నీ మంచి సినిమాల్లోనే నటిస్తానని చెప్పుకొచ్చాడు నందమూరి నటసింహం. అయితే బాలయ్య మంచి కథలు ఉన్న మంచి సినిమాల్లో నటించాలంటే ముందు ఆ ఇమేజ్‌ని, అభిమానుల్ని పక్కన బెట్టాలి. అది కుదరదు కాబట్టి .. ఇక ఇలాంటి బాకా ఊదుడు కథలే సెట్స్‌కెళతాయన్నది నిజం.


Tags:    

Similar News